Homeక్రీడలుHardik Pandya: హార్ధిక్ పాండ్యా తోపు.. నువ్వు గొప్పోడివి సామీ!

Hardik Pandya: హార్ధిక్ పాండ్యా తోపు.. నువ్వు గొప్పోడివి సామీ!

Hardik Pandya: హార్థిక్ పాండ్యా మంచి ఆటగాడు. గుజరాత్ టైటాన్స్ కు ఐపీఎల్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. టీంను నడిపించిన విధానం కెప్టెన్సీ తీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం టీమిండియాకు కూడా తన సేవలు అందిస్తున్నాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆడిన ప్రతి ఆటలో తనదైన ముద్ర వేస్తూ రాణిస్తున్నాడు. దీంతో సెలెక్టర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. పాండ్యాను ఎంపిక చేసినందుకు తమ నమ్మకాన్ని వమ్ము చేయడం లేదని చెబుతున్నారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నాడు. విజయాల ముంగిట్లో మురిసిపోతున్నాడు.

Hardik Pandya
Hardik Pandya

టీ 20 మ్యాచుల్లోనూ అదిరిపోయే ప్రదర్శన చేసి అందరిని అబ్బురపరచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా రాణించి ఔరా అనిపిస్తున్నాడు. మూడో వన్డేలో హార్థిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. దీంతో వన్డే సిరీస్ కూడా ఇండియా వశం చేసుకుంది. ఇంగ్లండ్ కు నిరాశే మిగిలింది. జట్టు విజయంలో హార్థిక్ పాండ్యా చూపిన ప్రతిభ ఎనలేనిది. టీ 20తోపాటు ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో హార్థిక్ పాండ్యా రికార్డు సాధించడం గమనార్హం.

Also Read: Hansika: బ్లాక్ అవుట్ ఫిట్ లో హన్సికా మెరుపులు.. పిక్స్ కేక

మూడో వన్డేలో బ్యాట్ తో పాటు బంతితో కూడా మెరుపులు మెరిపించాడు. తొలుత నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన పాండ్యా బ్యాట్ తో కూడా సత్తా చాటాడు. 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లుండటం విశేషం. పంత్ తో కలిసి ఐదో వికెట్ కు 123 భాగస్వామ్యం సాధించాడు. దీంతో పాటు ఓ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై నాలుగు వికెట్లు తీసి అర్థసెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించి మరో మైలురాయి దాటిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఖ్యాతి గడించాడు.

Hardik Pandya
Hardik Pandya

గతంలో శ్రీకాంత్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లు ఈ రికార్డు నెలకొల్పగా పాండ్యా వారి సరసన ఐదో ఆటగాడిగా చేరాడు. దీంతో ఇండియా విజయంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఇంగ్లండ్ ఆశలను వమ్ము చేశారు. హార్థిక్ పాండ్యా ప్రదర్శనకు అందరు ఫిదా అవుతున్నారు. బ్యాట్ తో పాటు బంతితో మెరిపించిన పాండ్యాను నువ్వు తోపువని కీర్తిస్తున్నారు. నీకంటే బాగా ఆడేవారెవరు సామీ అంటూ స్తుతిస్తున్నారు. టీమిండియాలో హార్థిక్ పాండ్యా కెరీర్ ఓ మైలుగాయిగా నిలవనుందని తెలుస్తోంది.

Also Read:Svalbard: వీసా లేకుండానే వెళ్లి సెటిల్ అయిపోయే అందమైన సుందర ప్రదేశం ఏదో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular