Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి శెట్టి సౌత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతూనే ఉంది. తాజాగా అమ్మడు హిందీ అవకాశాల కోసం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కొన్ని రోజులు హైదరాబాద్ లో, మరికొన్ని రోజులు ముంబైలో ఉంటున్న కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ కోసమే అక్కడ ఎక్కువగా గడుపుతోంది. ఎట్టకేలకు ఒక మంచి బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కృతి శెట్టి సెట్ చేసుకుందని తెలుస్తోంది.

కృతి శెట్టి పలు బాలీవుడ్ సినిమాలు ఒప్పుకున్నట్లు వార్తలు రాగా, దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, ఈ మధ్యనే కరుణ్ జోహార్ తాను నిర్మించే సినిమాలో కృతి శెట్టి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఇప్పుడు మరో సినిమా కూడా ఆమె ఖాతాలో పడే ఛాన్స్ ఉందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది.
Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యా తోపు.. నువ్వు గొప్పోడివి సామీ!
ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన రాతకోతలు ఇప్పటికే పూర్తయ్యాయి అని, ప్రస్తుతం షెడ్యూల్స్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఇక ఇదంతా నిజమైతే కనుక కృతి శెట్టి నటిస్తున్న మొట్టమొదటి హిందీ సినిమాకి రంగం సిద్ధమైనట్టే చెప్పాలి.
దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక కరుణ్ జోహార్ నిర్మించే సినిమా కృతి శెట్టికి రెండో హిందీ సినిమా కానుంది. ఇది ఒక భారీ బడ్జెట్ మైథాలజికల్ సబ్జెక్టు ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఎలాగూ కృతి శెట్టికి తమిళ, తెలుగు భాషలలో వరుస సినిమాలు ఉన్నాయి.

ఇప్పుడు హిందీలో కూడా కృతి శెట్టికి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. అయితే, హిందీ సినిమాల పై ఆమె క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. కానీ.. ఆమె హిందీ సినిమాల పై మాత్రం ఇప్పుడు పలు రకాల వార్తల పుట్టుకు వస్తున్నాయి. ఏది ఏమైనా ‘కృతి శెట్టి’లో మంచి కమర్షియల్ పిల్ల ఉంది. తనకు వచ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
మొదట్లో నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునేది. కానీ, వరుస హిట్లు వస్తుండటం.. పైగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వస్తుండటంతో కృతి శెట్టి రెమ్యునరేషన్ ను రెండింతలు పెంచింది. సినిమాకి ఇప్పుడు 2 కోట్లు అడుగుతుందట. పైగా హీరో రేంజ్ ను బట్టి డబ్బులు అడుగుతుంది.
Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే