Vijay Deverakonda Ranabaali: పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు… ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబలి’ అంటూ ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 1850వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి ఇండియన్స్ కి మధ్య జరిగిన ఒక యుద్ధ వాతావరణం లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒరిజినల్ కథనా, లేదంటే ఫిక్షన్ స్టోరీ నా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ గతంలో టాక్సీవాలా, శ్యాం సింగరాయ్ లాంటి సినిమాలను చేశాడు. ఇక రణబలి సినిమాకి మొదటి ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదట. మొదటిగా అతని వేరే హీరోకి ఈ కథను వినిపించాడు. ఆ హీరో రిజెక్ట్ చేయడంతో కథ విజయ్ దేవరకొండ వద్దకు వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే న్యాచురల్ స్టార్ నాని గా తెలుస్తుంది. నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సమయంలో ఈ కథనైతే వినిపించారట. నాని కథ బాగుంది కానీ ప్రస్తుతం డేట్స్ లేవు. ఈ సినిమాని చేద్దాం కానీ కొద్ది రోజులు వెయిట్ చేయాలి అని చెప్పారట.
కానీ రాహుల్ సాంకృత్యాయన్ కి వెయిట్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఆల్రెడీ టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండ ఒక సక్సెస్ ని అందించాడు. కాబట్టి అతనితో ఈ సినిమా చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో విజయ్ దేవరకొండకు కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం…