TaTa: కొత్త కారు కొనేవారి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అయితే వారి ఆలోచనలకు తగిన విధంగా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. కారు కొనాలని అనుకునేవారిలో ధరను కొందరు.. మైలేజ్ ను మరికొందరు చూస్తారు.. ఇంకోందరు మాత్రం ధరతో సంబంధం లేకుండా ప్రీమియం లుక్ లో ఉండాలని కోరుకుంటారు. ఈ డిజైన్ కు వింటేజ్ లుక్ ఉంటే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తారు. వీరికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని పాత మోడల్ కార్లు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. వీటిలో అంబాసిడర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా 90వ దశకంలో ఆకట్టుకున్న ఓ కారు తిరిగి కొత్తగా తయారై మార్కెట్లోకి రాబోతుంది. దీనిని ఇటీవల ఢిల్లీలో జరిగిన Auto Expoలో ప్రదర్శించారు. ఇంతకీ ఈ కారు ఏది? ఆ వివరాలు ఎలా ఉన్నాయి?
SUV వేరియంట్ లో వచ్చే కార్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇవ ప్రీమియం లుక్ ను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా 90 దశాబ్దంలో ఆకట్టుకున్నTaTa కంపెనీకి చెందిన SIERRAతిరిగి రాబోతుంది. కొత్తగా వచ్చే కారుకు సియోర్రా ICEఅనే నామకరణం చేశారు. దీని డిజైన్ ను చూసి చాలా మంది టెమ్ట్ అవుతున్నారు. ఆనాటి విశేషాలు గుర్తుకువచ్చేలా ఈ మోడల్ ఉండడంతో ఇంప్రెస్ అవుతున్నారు. సియోర్రా కారు డిజైన్ బాగా ఆకట్టుకుంటుంది. దీనికి Alpine విండోస్ ను అమర్చారు. ఫ్రంట్, బ్యాక్ మెయిన్ ఎల్ ఈడీ లైట్స్ ను చేర్చారు. రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. స్లీక్ లక్ తో ఆకర్షిస్తున్న ఈ కారులో 4 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 4 లేదా 5 సీట్లు ఉంటాయి.
సియార్రా కారులో ఫీచర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో 12.3 అంగుళాల స్క్రీన్ తో పాటు వైర్ లెస్ ఛార్జర్, హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్, వెంటిలేటేడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్ రూస్ తో పాటు సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , అడ్వాన్స్ అసిస్టెన్స్ సిస్టం వంటి వి ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 170 బీహెచ్ పీ పవర్, 280 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
సియొర్రా ఐసీఈ కార ధరను రూ. 15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే మార్కెట్లో న్న స్కార్పియో -ఎన్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటన్నారు. అయితే పాత మోడల్ లో ఉన్న ఈ కారున చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు. ధర ఎక్కువ అయినా సరే.. దీనిని కొనాలని చూస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొంటన్నారు. ప్రస్తతం ఆటో ఎక్స్ పోలో షో చేసిన ఈ కారు మార్కెట్లోకి వస్తుందో తెలియాల్సి ఉంది.