Rohit Sharma: టీమిండియా గురువారం ఇంగ్లండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. జట్టులో అందరు రాణిస్తున్నా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. లోయర్ ఆర్డర్ లో దినేష్ కార్తీక్ విఫలం కావడంతో రిషబ్ పంత్ కు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో జింబాబ్వేపై పంత్ కూడా తడబాటుకు గురి కావడంతో ఇప్పుడు ఎవరిని తీసుకుంటారో అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే డైలమాలో పడిపోయారు.

గురువారం జరిగే మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ దీనిపై ఎటు తేల్చుకోవడం లేదు. దినేష్ కార్తీక్, పంత్ లు ఇద్దరు కూడా ఫామ్ లో లేకపోవడంతో ఎలాగనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. జట్టులో ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో గురువారం జరిగే మ్యాచ్ కు ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారో తెలియడం లేదు. ఇద్దరు కీపర్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు. మరోవైపు సూర్యకుమార్ తన సత్తా చాటుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.
గత ప్రపంచ కప్ భారత్ కు గొప్పదేమీ కాకపోయినా సూర్యకుమార్ యాదవ్ బాగా రాణిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. బంతి బంతికి అతడి ఆట తీరు ఎంతో వైవిధ్యంగా ఉంటోంది. రోహిత్ సేన గురువారం నాటి మ్యాచ్ లో నెగ్గాలని చూస్తున్న తరుణంలో వికెట్ కీపర్ గా ఎవరికి చాన్స్ ఇవ్వాలని ఆలోచనలో పడింది. ఫామ్ లో లేని ఆటగాళ్లను ఎలా జట్టులోకి తీసుకుంటారో తెలియడం లేదు. కానీ మొత్తానికి ఇద్దరికి మాత్రం జట్టులో స్థానం దక్కడం ఖాయమే. కానీ అది ఎవరికి అదృష్టం వరించనుందో అంతుచిక్కడం లేదు.

టీమిండియా సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ను మట్టికరిపించాలని కసరత్తులు చేస్తోంది. ప్రతి ఆటగాడు తమదైన శైలిలో రాణించి విజయం అందించాలని ఆశిస్తున్నారు. సమష్టి కృషితోనే గెలుపు సాధ్యం అవుతుందని చెబుతున్నారు. టీమిండియా విజయం కోసం అన్ని దారులు వెతుకుతోంది. సెమీస్ ను సమర్థంగా ఎదుర్కొని ఫైనల్ కు చేరుకోవాలని ఆటగాళ్లు సంసిద్ధంగా ఉన్నారు. సెమీఫైనల్ లో విజయంతో ఫైనల్ లో కూడా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. టీమిండియా ఆశలు ఏమేరకు నెరవేరుతాయో వేచి చూడాల్సిందే.