https://oktelugu.com/

Jabardasth New Anchor: జబర్దస్త్ కొత్త యాంకర్ ని చూసి షాక్.. ఊహకు అందని ట్విస్ట్ ఇది.. అసలేం జరిగింది ?

Jabardasth New Anchor: హాట్ బ్యూటీ అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వస్తారు అంటూ పెద్ద చర్చే జరిగింది. లాస్ట్ వీక్ అనసూయ స్థానంలో కొత్త అమ్మాయిని ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారు. జబర్దస్త్ టీమ్ చేసిన ఈ ఆహ్వానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి ?, అనసూయను బీట్ చేస్తోందా ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కూడా విపరీతంగా కొనసాగింది. అందుకే, జబర్దస్త్ ప్రసారమయ్యే సమయానికి టీవీలకు అతుక్కుపోయి […]

Written By:
  • Shiva
  • , Updated On : August 8, 2022 / 10:17 AM IST
    Follow us on

    Jabardasth New Anchor: హాట్ బ్యూటీ అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వస్తారు అంటూ పెద్ద చర్చే జరిగింది. లాస్ట్ వీక్ అనసూయ స్థానంలో కొత్త అమ్మాయిని ఏకంగా పల్లకిలో తీసుకొచ్చారు. జబర్దస్త్ టీమ్ చేసిన ఈ ఆహ్వానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి ?, అనసూయను బీట్ చేస్తోందా ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కూడా విపరీతంగా కొనసాగింది. అందుకే, జబర్దస్త్ ప్రసారమయ్యే సమయానికి టీవీలకు అతుక్కుపోయి ఆమె రాక కోసం ఎదురుచూశారు. తీరా చూశాక అందరూ ఉసూరుమన్నారు. చీర కొంగు ముఖానికి అడ్డుపెట్టుకుని స్టేజి పైకి వచ్చిన ఆ యాంకర్.. ఎంతకీ ముసుగు తీయకపోవడంతో చలాకీ చంటి ఆమె ముగుసు తొలగించాడు. చూస్తే రష్మీ గౌతమ్.

    Jabardasth

    Also Read:Vastu Directions: పడక గదిలో ఎటు వైపు పడుకుంటే ప్రయోజనం కలుగుతుందో తెలుసా?

    ఒక్కసారిగా రష్మీ గౌతమ్ ముఖం చూసి చంటి షాక్ అయ్యాడు. యాంకర్ గా కొత్త అమ్మాయి వస్తుంది అనుకుంటే నువ్వొచ్చావా… అంటూ చంటి నిట్టూర్చాడు. ఒక్క చంటినే కాదు ప్రేక్షకులు కూడా నిట్టూర్చారు. ఇంత భారీ బిల్డప్ ఇచ్చి చివరకు రష్మీని చూపించే సరికి ప్రేక్షకులు పూర్తిగా నీరుగారిపోయారు. పైగా రష్మీ గౌతమ్ ఇచ్చిన బిల్డప్ కూడా ఏ మాత్రం పేలలేదు. దీనికి తోడు రష్మీ గౌతమ్ ఇచ్చిన వివరణ కూడా నీరసంగా ఉంది. ఆమె తెలుగు భాష లెక్క.. అక్కడా ఉంటా ఇక్కడా ఉంటా అంటూ పాచిపోయిన పంచ్ డైలాగ్ చెప్పింది. అయినా ఇప్పటికే జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు యాంకర్ కూడా సేమ్ అవ్వడం జబర్దస్త్ అభిమానులకు అసలు రుచించడం లేదు.

    rashmi

    నిజానికి అనసూయ ప్లేస్ లో మంజూష రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా కథనాలు వినిపిస్తూ వచ్చాయి. పైగా ‘మంజూష’కి గత నెల రోజుల నుంచి జబర్దస్త్ యాంకర్ పార్ట్ కు సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారని టాక్ నడిచింది. మంజూష డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ఆమె ఎంట్రీకి సంబంధించిన విజువల్స్ వరకూ ప్రతిదీ జబర్దస్త్ టీమ్ ఇప్పటికే వర్క్ చేశారని అని కూడా అన్నారు. కానీ చివరకు జబర్దస్త్ తెర పై రష్మీ ముఖమే ఎందుకు చూడాల్సి వచ్చింది.

    అసలు యాంకర్స్ కరువైనట్లు జబర్దస్త్ కి కూడా రష్మినే ఎందుకు యాంకర్ గా తీసుకున్నారు ?, ఇప్పుడు బుల్లితెర పై ఇదే హాట్ టాపిక్. రష్మీని యాంకర్ గా తీసుకోవడానికి ఒక కారణం ఉంది. అగ్రిమెంట్ విషయంలో మంజూష అయిష్టం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. అలాగే కొత్త యాంకర్స్ ఎవరిని తెచ్చినా సక్సెస్ రాగానే వాళ్ళ డిమాండ్స్ పెరుగుతున్నాయి. అలాగే భారీ ఆఫర్స్ వస్తే లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నే వదిలేసి పోతున్నారు. అదే రష్మీ గౌతమ్ అయితే మరో ఐదేళ్ల పాటు జబర్దస్త్ కే కట్టుబడి ఉంటానని అగ్రిమెంట్ చేసింది. అందుకే.. ఆమెతో షో లాగిద్దాం అని షో యాజమాన్యం నిర్ణయించుకుంది.

    Also Read: krithi shetty- Nithin: నితిన్ పై ‘కృతి శెట్టి’ సంచలన కామెంట్స్.. నితిన్ అలాంటి వ్యక్తి అట

     

    Tags