Summer workout tips: ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరిగా చేసుకుంటారు కొందరు. ఉదయం లేవగానే వ్యాయామం చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండి మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. అయితే వేసవి కాలంలో కూడా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ మిగతా కాలంలో కంటే వేసవికాలంలో వ్యాయామం ఎక్కువ చేయడం వల్ల శరీరంలో ఉన్న ఎనర్జీ తొందరగా కరిగిపోతుంది. దీంతో త్వరగా అలసిపోతారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఎండాకాలంలో వ్యాయామం చేసే సమయంలో కొన్ని టిప్స్ పాటించడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు. ఇంతకీ ఎండాకాలంలో ఎక్కువ వ్యాయామం చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Also Read : బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ ను మీ ఆహారం నుంచి స్కిప్ చేయాల్సిందే..
సాధారణ సమయంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య సూర్యోదయం అవుతుంది. కానీ ఎండాకాలంలో త్వరగా సూర్యుడు ఉదయిస్తాడు. దీంతో ఎండ వేడి ప్రారంభమవుతుంది. అయితే చాలామంది ఉదయం వ్యాయామం చేసే సమయంలో సూర్యోదయాన్ని పట్టించుకోరు. కానీ ఈ సమయంలో వ్యాయామం ఎక్కువ చేయడం వల్ల శరీరంలో ఉన్న నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో త్వరగా అలసిపోతారు. ఈ క్రమంలో వ్యాయామానికి వెళ్లే ముందే నీరు ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం పూర్తయిన తర్వాత మరోసారి నీటిని తీసుకోవాలి. దీంతో శరీరంలో నీటి శాతం సమపాలలో ఉంటూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
వేసవికాలంలో ఎక్కువగా హైడ్రేట్ అయ్యే ఫ్రూట్స్ను తీసుకోవాలి. ఆయిల్ లేదా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా లేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేసి నీరు తీసుకుంటే.. కడుపులో సమస్యలు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో వ్యాయామం చేయడం ద్వారా మరింతగా అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల పుచ్చకాయ లేదా దోసకాయ వంటి ఫ్రూట్స్ను తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉండాలి.
శరీరంలో ఎలక్ట్రోరల్స్ తో శరీరం ఎనర్జీగా ఉంటుంది. అయితే వేసవికాలంలో వ్యాయామం చేసే సమయంలో ఇవి తగ్గిపోతూ ఉంటాయి. వీటిని భర్తీ చేయడానికి ఇవి ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే కొబ్బరి బొండం వంటివి తాగుతూ ఉండాలి. ఎక్కువగా వ్యాయామం చేయాలనుకునేవారు వేసవి కాలంలో రోజు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
వేసవి కాలంలో ఎక్కువగా వ్యాయామం చేసిన సమయంలో ఏవైనా కొత్త మార్పులు వస్తే వెంటనే గుర్తించుకోవాలి. తలనొప్పి లేదా బాడీపెయిన్స్ వంటివి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వీటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మరింత అనారోగ్యానికి గురై అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇవి గుండె నొప్పికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది.
వ్యాయామం ఎక్కువగా చేయాలని అనుకునేవారు కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఎందుకంటే ఇతర దుస్తుల వల్ల అధికంగా చెమట వచ్చి డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాటన్ దుస్తుల వల్ల చెమటను పీల్చుకొని చల్లని గాలిని అందిస్తాయి. దీంతో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.