Indigestion Problem: ఇటీవల కాలంలో మనకు అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. చలికాలంలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో అజీర్తితో అందరు బాధపడుతుంటారు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. మనలో చాలా మంది మసాలాలకు బాగా అలవాటు పడిపోయారు. అన్ని కాలాల్లోగా ఈ కాలంలో అదే తీరుగా డైట్ ను తీసుకుంటే ప్రమాదమే. శీతాకాలంలో మనం తినే ఆహారాలు అంత త్వరగా జీర్ణం కావు. దీంతో అజీర్తి ఇబ్బంది పెడుతుంది. దీంతో మనం తినే ఆహారాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే మన కడుపు మన మాట వినదు. అజీర్తి సమస్యతో సతమతమవుతుంటాం.

ఈ మధ్య కాలంలో అందరు జంక్ ఫుడ్స్ కు అలవాటు పడ్డారు. ఏది కావాలన్నా దానితో సంబంధమున్న ఆహారాలే తింటున్నారు. అలా చేయడం కరెక్టు కాదని తెలిసినా మానలేకపోతున్నారు. ఫలితంగా ఇబ్బందుల పాలవుతున్నారు. బేకరీ ఫుడ్స్, మసాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. సులభంగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే ఉత్తమం. మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. తిన్న పదార్థం హాయిగా జీర్ణం అయితే ఎలాంటి కష్టాలు ఉండవు. తేలికగా జీర్ణమయ్యే వాటిని తీసుకుని అజీర్తిని దరిచేరనీయకూడదు.
స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే కూడా నష్టమే. గడ్డకట్టిన ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. రాత్రి పూట పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే మనం తిన్నవి సులభంగా అరుగుతాయి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే మనకు అజీర్తి సమస్య రాకుండా నిరోధించుకోవచ్చు. మాంసాహారాలను కూడా మితంగా తీసుకోవాలి. ఈ కాలంలో ఇష్టమొచ్చిన తీరుగా నాన్ వెజ్ తింటే మన కడుపుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా గ్యాస్, తేన్పులు వంటి సమస్యలకు బాధ్యులం కావచ్చు. అందుకే జాగ్రత్తలు తీసుకోవడానికి మొగ్గు చూపాలి.

ఉదయం లేచిన వెంటనే కపాలభాతి చేయాలి. ముక్కుల్లో నుంచి శ్వాస గట్టిగా తీసుకుంటూ వదలాలి. రాగి పాత్రల్లో నీరు తాగడం మంచి ఫలితం ఇస్తుంది. మనకు రాగి అత్యంత సురక్షితమైన ఖనిజం. దీంతో మనకు ఎన్నో లాభాలున్నాయి. అందుకే రాగిపాత్రలు వాడుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు పద్మాసనం, వజ్రాసనంలో కాసేపు కూర్చుంటే మంచిది. ఇలా జాగ్రత్తలు తీసుకుని మనకు అజీర్తి సమస్య లేకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందరు జాగ్రత్తలు తీసుకుని అజీర్తి సమస్యను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.