Stress relief tips for problems: జీవితంలో నాకు అన్ని సమస్యలే.. అని కొందరు అంటూ ఉంటారు. వాస్తవానికి ఒకరి సమస్యలకు ఇంకొకరు అస్సలు కారణం కానీ కాదు. ఎవరి సమస్యలకు వారే కారణం. వారి జీవితంలో వారి ప్రవర్తన.. వారి అలవాట్లు.. ఇవే సమస్యలు సృష్టిస్తాయి. అయితే ఆలోచన విధానం సరిగ్గా ఉంటే.. వీటిని పరిష్కరించుకోవచ్చు. ఆలోచన విధానంలో అహంకారం కూడా ఉంటుంది. ఈ అహంకారం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కొందరు తమకు అహంకారం లేదని పైకి చెబుతూనే.. ప్రవర్తనలో దానిని ప్రదర్శిస్తారు. ఇలా అహంకారంతో ఉంటూ వారు మాత్రమే కాకుండా ఇతరులకు నష్టం చేకూరుస్తారు. దీంతో వారితోపాటు వీరు కూడా సమస్యల్లో ఇరుక్కుంటారు. ఒకవేళ అనుకోకుండా నైనా కొన్ని సమస్యల్లో ఇరుక్కుపోతే.. వాటి నుంచి ఎలా బయటపడాలి? ఏం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి?
ఒక్కోసారి ఎదుటివారు చెప్పే కొన్ని మంచి మాటలు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వీటివల్ల ఎంతో మేలు జరుగుతుందనే విషయం ఆ తర్వాత తెలుస్తుంది. ఉదాహరణకు ఏదైనా అనారోగ్యం జరిగినప్పుడు వైద్యుడు వద్దకు వెళ్తే.. రకరకాల మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్ వేసుకోవడం ఎంతో కష్టంగా మారుతుంది. కానీ ఈ మెడిసిన్ ఇష్టం లేదు అని చెప్పడం వల్ల మరింత నష్టమే జరుగుతుంది. అంటే ఇక్కడ ఇష్టం లేకపోయినా మేలు కోసం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అలాగే కొందరు మంచి మాటలు చెప్పినప్పుడు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాటిని పాటించడం వల్ల జీవితానికి మేలే జరుగుతుంది అని గ్రహించాలి. అయితే వీటిని స్వీకరించడానికి అహంకారం అడ్డు వస్తుంది. అహంకారం తగ్గించుకుంటే ఎదుటివారి చెప్పే ప్రతి విషయాన్ని వినగలుగుతారు.
ఇదే సమయంలో అహంకారం దూరం కావాలంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అంటే ఒక కుటుంబంలో ఒక్కోసారి ఎన్నో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఎవరో ఒకరు సర్దుకుపోవడం మంచిది. వాస్తవానికి ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడానికి సర్దుకుపోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఇక్కడ ఇష్టం లేకపోయినా సర్దుకుపోవడం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు. అలా కాకుండా ఒకరిపై ఒకరు బెట్టు చేయడం వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సర్దుకుపోయే మనస్తత్వం ఉండడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుంది.
ఇదే సర్దుకుపోయే మనస్తత్వం ప్రతి సమస్యకు పరిష్కారం అవుతుంది. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎన్నో రకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి. అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అలా కాకుండా అహంకారంతో ఎవరిమాటా వినకుండా ముందుకు వెళ్లడం ద్వారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ఇలా అహంకారంతో ఉండడం వల్ల కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా.. మరికొందరి జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల సర్దుకుపోయే మనస్తత్వంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.