Sri Rama Navami 2022 Wishes in Telugu, శ్రీరామనవవి శుభాకాంక్షలు : శ్రీరాముడు ‘వసంత’ రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుడి జన్మదినంను ప్రజలు పండుగలా జరుపుకుంటారు.
హిందువుల్లో అతి ముఖ్యమైన పండుగ రామాయణం. ఈ రామయణంలో జరిగిన పట్టాభిషేక మహోత్సవాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. శ్రీరాముడి జన్మదినమైన చైత్రశుద్ధ నవమిరోజు శ్రీరామనవమి జరుగుతుంది. సీతారాముల కల్యాణంతో పాటు పడ్నాలుగేళ్ల వనవాసం తరువాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా ఈరోజే జరగడంతో సీతారాముల కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా భక్తులు వడపప్పు, పానకం తయారు చేసి పంచిపెడతారు.
-శ్రీరామనవమి చరిత్ర
రామాయణంలో అయోధ్యకు రాజు అయిన దశరథుడికి ముగ్గురు భార్యలు. అతడికి పిల్లలు లేకపోవడంతో యజ్ఝం చేస్తాడు. అప్పుగు అగ్నిదేవుడు ఇచ్చిన పామయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. ఆ పాయాసాన్ని ముగ్గురు భార్యలకు పంచుతాడు. వాళ్ల ముగ్గురు భార్యలు గర్భం దాల్చుతారు. చైత్రమాసం తొమ్మిదో రోజు అయిన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య ‘శ్రీరాముడి’కి జన్మనిచ్చింది. ఆయన జన్మదినాన్నే ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటాం
Sri Rama Navami 2022 Wishes, Messages, Whatsapp Greetings in Telugu
శ్రీరామనవవి శుభాకాంక్షలు అయితే శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయాలి..? ఏ విధంగా విషేష్ చెప్పాలి..? మీకోసం కొన్ని..
అందాల దేవుడి మందిరం
అయోధ్య రామునికి అభివందనం..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..

అరవిరి కన్నుల ముదముగ
వరునిగా రాముని జాడగ..
తరుణులు మిథిలానగరిన దారులు గాచెన్
ధరణీసుత పతిని గనగ తన్మయ మొందెన్..

సీతారాముల కల్యాణం
మీ ఇంట్లో అందరికి సుఖ సంతోషాలను అందించాలని,
శ్రీరామ చంద్రమూర్తి దయ మీకుండాలని కోరుకుంటూ..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..

సీతారాముల కల్యాణంలోని వివిష్టతను అర్థం చేసుకొని..
వారని నిత్యం స్మరించాలి…
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

శ్రీరామనవవి శుభాకాంక్షలు 2022
ఆపదామప హర్తాతరం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం..
శ్రీరామ జయరామ జయరామ..
శ్రీరామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామత తత్తుల్యం రామనామ వరాననే
మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..
కానీ సీతారాముల కల్యాణం ప్రతీసారి జరిపించాలనుకుంటారు..
ఈ పెళ్లి ఎప్పటికీ ప్రత్యేకమే..
ఏటా మనమే దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపిస్తాం..
మనింట్లో పెళ్లి అని మురిసిపోతాం..
ఈ పెళ్లి జరగగానే సంబంధాల గురించి అన్వేషిస్తాం..
పచ్చని తోరణాలు.. మంగళ వాయిద్యాల మధ్య జరిగే శ్రీరాముని పెళ్లి
ప్రతీసారి ఘనంగా జరగాలని కోరుకుంటూ..
ఒక తండ్రికి కొడుకు మీదున్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రిమీదున్న గౌరవం
ఒక భర్తకు భార్యమీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్తమీద ఉన్న నమ్మకం
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్నమీద ఉన్న మమకారం
అన్నీ కలకగలిపి మనిషి బతకడానికి అవసరమైనదే రామాయణం..
ఒక మనిషిలోని బలం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు..
వీరికి అండగా నిలిచిన వారి చరిత్రే రామాయణం..
మీ ఇంట్లో కుటుంబం సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడి అనుగ్రహంతో సర్వదోషాలు తొలగి
శుభాలు చేకూరాలని కోరుకుంటూ..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
పట్టాభి రామునికి ప్రియవందనం..
పాపవిదూరునికి జయవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
అందాల దేవునికి మదే మందిరం..
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు
ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ..
[…] Tollywood Stars In Lord Rama Roles: శ్రీరాముడి గురించి తెలియనివారుండరు. రామా అని పలకని వారుండరు. అందులోనూ శ్రీరాముడు తెలుగు వారికి ప్రత్యేకం. రామాయణ, మహాభారతాలను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటారు. రాముడి వ్యక్తిత్వం ప్రపంచానికే ఆదర్శం.. ఆచరణీయం.. దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అంటూ ఆయన పేరు మార్మోగుతూనే ఉంటుంది. హిందువులే కాకుండా ఇతర మతాల వారికి కూడా శ్రీరాముడి గురించి తెలిసే ఉంటుంది. అయోధ్యలో రామ మందిరాన్ని ఎంతో వైభవవోపేతంగా నిర్మిస్తున్నారు. కాగా చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామనవమిని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. […]