Allu Arjun: ‘పుష్ప’ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. శుక్రవారం తన 40వ బర్త్ డే చేసుకున్న బన్నీ తన స్నేహితులకు ప్రత్యేక పార్టీ ఇచ్చాడు. సెర్బియా, బెల్‌గ్రేడ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఇచ్చిన ఈ పార్టీకి కేవలం 50మందిని మాత్రమే ఆహ్వానించాడు. స్నేహితుల సమక్షంలో తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి బన్నీ కేక్ కోశారు.

ఇక బన్నీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమవారు, సినీ ప్రేక్షకులు, అభిమానులందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది.
మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం బన్నీ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ నుంచి వచ్చాక బన్నీ తిరిగి పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉంటాడు. ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2’ పై సుకుమార్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. అయితే, ‘పుష్ప 2’లో కొత్త నటీనటులను సుక్కు తీసుకోబోతున్నాడు .
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అసలు ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ పై ఏం చేయనున్నారు ? అనే కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. నిజానికి అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఫుల్ క్రేజ్. అంచనాలు బారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు.

అందుకే, ‘పుష్ప’ పార్ట్ 1 టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏది ఏమైనా పార్ట్ 1 అంచనాలను అందుకోలేకపోయింది. కానీ, కమర్షియల్ గా బాగానే కలెక్ట్ చేసింది. అందుకే, పార్ట్ 2 పై నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. కానీ ‘పుష్ప పార్ట్ 2’ పై భారీ ఒత్తిడి ఉంది. ఎలాగూ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా సగం అయిపోయింది. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు చేసి సుక్కు ఈ పార్ట్ 2 ను ప్లాన్ చేస్తున్నాడు.
[…] Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే. . యంగ్ బ్యూటీ ‘ఎస్తర్ అనిల్’ తన కళాశాల విద్య శుక్రవారంతో పూర్తయినట్టు తెలిపింది. ‘ఈ రోజు చివరి పరీక్ష రాశాను అంటూ తన ఫొటోను కూడా షేర్ చేసింది. మరి, ఎలాగూ పరీక్ష అయిపోయింది కాబట్టి.. ఇక రేపటి నుంచి రచ్చ చేస్తాను అన్నట్టు అమ్మడు వాలకం ఉంది. […]
[…] Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. గత సీజన్ లో కంటే భిన్నమైన టాస్క్ లతో నిత్యం అలరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యలో బిగ్ బాస్ గొడవ పెడతాడో ఊహించడం చాలా కష్టం. ఈ నాన్ స్టాప్ షోలో బిగ్ బాస్ చిత్రవిచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నాడు. ఉన్న కంటెస్టెంట్స్ తో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నాడు. […]