Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబయి నుంచి పూణె వెళ్తుండగా పన్వేల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మలైకా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. అదే సమయంలో రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మీటింగ్ కోసం వెళ్తున్న వాహనాలను.. కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయమైంది.

కాగా తాజాగా యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న మలైకా అరోరా మీడియా ముందుకు వచ్చి తనను కాపాడిన వారికి ధన్యవాదాలు తెలిపింది. ప్రమాదానికి గురైన ప్రాంతంలోని వారు తనను ఆస్పత్రిలో చేర్పించారని, అభిమానులకు, బంధువులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. అయినా నైట్ పార్టీలు అంటూ తిరుగుతూ పగలు అశ్రద్ధగా వెహికల్స్ తోలితే ప్రమాదాలే జరుగుతాయి.
ఇక బాలీవుడ్ లో చయ్యా చయ్యా పాటతో ఓవర్ నైట్ స్టారైపోయారు మలైకా. మాహి వే, మున్నీ బద్నం లాంటి హిట్ ఐటమ్ నంబర్లతో క్రేజ్ పెంచుకున్నారు. పలు టీవీ షోలకు జడ్జిగా, హోస్టుగానూ ఆమె వ్యవహరించారు. కానీ ‘మలైకా అరోరా’ అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి, తన మాజీ భర్త అయిన ‘సల్మాన్ తమ్ముడి’కి హ్యాండ్ ఇచ్చి, అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుందని ఆ పెళ్లి కాలేదు.
పెళ్లి కాకపోయినా 36 ఏళ్ల అర్జున్ కపూర్ తో 48 ఏళ్ల మలైకా అరోరా చాలా కాలంగా సహా జీవనం చేస్తూ ఉంది. ఏది ఏమైనా 48 ఏళ్ల వయసులోనూ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా మలైకా డ్రెస్సింగ్ పై నిత్యం నెట్టింటా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ వయసులో ఇదేం డ్రెస్ అంటూ ఆమె పై నెటిజన్లు జోక్ లు పేలుస్తూనే ఉంటారు. అయినా ఇలాంటి డ్రెస్ లు మలైకాకి కొత్తేమి కాదు. ఎందుకంటే.. ఆమె క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళ్తుంది, ఆ సమయంలో నిత్యం ఇలాంటి డ్రెస్ లనే వేసుకుంటుంది. మొత్తానికి కారు ప్రమాదంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది.