Asia Cup 2022: ఈనెల 26న ఐపీఎల్( ఇండియన్ ప్రీమియం లీగ్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ కబురు విందు భోజనంలా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆసియ కప్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా శనివారం ఒక ప్రకటన వెళుబడడమే అని చెప్పవచ్చు. ఆసియా కప్ లో ఆడనున్న జట్ల సభ్యులు ఇందుకుగాను కప్ నిర్వహణపై చర్చించారు.

ఆసియా కప్ ఆగస్టు 27 నుండి ప్రారంభం కావడం. 20 ఫార్మేట్ లోనే ఆగస్టు 20 నుండే క్వాలిఫై మ్యాచ్ లు ఆడనున్నారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక,బంగ్లాదేశ్,ఆఫ్గనిస్తాన్ ఆసియా కప్ ఆడుతుండగా ఆయా దేశాలతో పాటు ఆడేందుకు కొత్తగా హంకాంగ్, సింగపూర్,కువైట్,లు ఉవ్విల్లురుతున్నాయి.
Also Read: Mohan Babu: రాజకీయాల్లో వాడుకొని వదిలేశారు..మోసపోయా..మోహన్ బాబు సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?
వాయిదా1984 నుండి ఇప్పటివరకు 14 సార్లు ఈ కప్ జరగగా భారత 7సార్లు విజేతగా నిలిచింది. 2018లో చివరిసారిగా జరిగిన ఈ క్రీడ కరోనా కారణంగా మూడు సంవత్సరాలు వాయిదా పడింది. ఐతే ఈ సంవత్సరం ఆసియా కప్ కు ఆసియా కప్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ లో సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందం నెలకుంది.

ఒకవైపు ఐపీఎల్ సంబరం ముగిసిన వెంటనే ఆసియా కప్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులకు క్రికెట్ విందుభోజనం తయారు అయిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా కారణంగా క్రికెట్ మిస్ అయిన అభిమానులు పాత ఆసియా కప్ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జైషా ను మరో ఏడాదిపాటు అధ్యక్షుడిగా కొనసాగించాలని కౌన్సిల్ కమిటీ నిర్ణయించింది.
Also Read: Age Relaxation: తెలంగాణలో వయోపరిమితి పెంపుతో ఉద్యోగాల కోసం పోటీ తీవ్రమైందా?