Snacks: పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది చిరుతిళ్లను ఇష్టపడతారు. రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకే లభించడం వల్ల చాలామంది వీటిపై ఆసక్తి చూపిస్తారు. అయితే చిరుతిళ్ల తినడం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని గుర్తుంచుకోవాలి. చిరుతిళ్ల వల్ల పిల్లలను చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. చిరుతిళ్లు కడుపులో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఛాన్స్ ఉంది.
చిరుతిళ్లు ఎక్కువగా తినేవాళ్లలో ఎనామిల్ పొర కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎనామిల్ పొర కరిగిపోతే దంత సంబంధిత సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరుతిళ్లు కొంతమందిలో ఛాతీ సంబంధిత సమస్యలతో పాట్య్ గ్యాస్, అజీర్తికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read: టీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ప్రధాని నరేంద్ర మోడీపై సభా హక్కుల ఉల్లంఘన?
చిరుతిళ్లు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఎవరైతే ప్రతిరోజూ చిరుతిళ్లు తింటారో వాళ్లు బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిరుతిళ్లు తినేవాళ్లలో ప్లేట్ లెట్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయనే సంగతి తెలిసిందే.
చిరుతిళ్లు తరచూ తినేవాళ్లలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. చిరుతిళ్లలో ఉండే కొన్ని పదార్థాల వల్ల బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. చిరుతిళ్లు తరచూ తినేవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. చిరుతిళ్లు తినే పెద్దలను గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: అపర కుబేర పార్టీగా బీజేపీ.. ఇన్ని వేల కోట్లు ఎలా సేకరించిందంటే..?