https://oktelugu.com/

Jio: కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్.. ఉచితంగా కాల్స్, డేటా పొందే ఛాన్స్?

Jio: దేశీఅయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు తీపికబురు అందించింది. ఇతర టెలీకాం కంపెనీలతో పోల్చి చూస్తే జియో తక్కువ రేటుకే కాల్స్, డేటా పొందే అవకాశాన్ని సంగతి తెలిసిందే. సంవత్సరం సంవత్సరానికి జియో యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లు జియో వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం జియో నెట్వర్క్ డౌన్ అయింది. ఆ సమయంలో జియో కస్టమర్ల నుంచి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2022 / 08:55 PM IST
    Follow us on

    Jio: దేశీఅయ టెలీకాం దిగ్గజం జియో కస్టమర్లకు తీపికబురు అందించింది. ఇతర టెలీకాం కంపెనీలతో పోల్చి చూస్తే జియో తక్కువ రేటుకే కాల్స్, డేటా పొందే అవకాశాన్ని సంగతి తెలిసిందే. సంవత్సరం సంవత్సరానికి జియో యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లు జియో వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం జియో నెట్వర్క్ డౌన్ అయింది.

    ఆ సమయంలో జియో కస్టమర్ల నుంచి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు అందాయి. జియో యూజర్లు నెట్వర్క్ సమస్య వల్ల కాల్స్ మాట్లాడటంలో, డేటాను వినియోగించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ముంబై, ఇతర ప్రాంతాలకు చెందిన జియో యూజర్లు ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే అలా ఇబ్బందులు పడిన వాళ్లకు జియో శుభవార్త చెప్పింది.

    నెట్వర్క్ సమస్యలు వచ్చిన కస్టమర్లు ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ కాలపరిమితికి అదనంగా రెండు రోజుల పాటు కాల్స్, డేటా సేవలను పొందనున్నారు. అయితే అంతరాయం ఏర్పడిన కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హతను కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. రెండురోజుల పాటు జియో యూజర్లకు ఇబ్బంది కలగగా రెండు రోజుల పాటు జియో అదనపు ప్రయోజనాలను అందించడం గమనార్హం.

    జియో తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. జియో నెట్వర్క్ వల్ల అంతరాయం కలిగిన కస్టమర్లకు మొబైల్ కు రెండు రోజుల ప్రీపెయిడ్ వ్యాలిడిటీని పెంచుతున్నట్టు సందేశాలు వస్తున్నాయి. మీరు కూడా జియో యూజర్ అయితే వెంటనే అలాంటి మెసేజ్ ఏమైనా మొబైల్ కు వచ్చిందేమో చెక్ చేసుకుంటే మంచిది.