
Pruthwi Shaw : పృథ్వీషా.. వర్ధమాన క్రికెటర్. తరచూ జట్టులో స్థానం దక్కించుకుంటూ పేలవ ప్రదర్శనతో స్థానం కోల్పోతున్నాడు. మొన్నటి వరకు వివాద రహితుడిగా ఉన్న షాపై ఫిబ్రవరిలో దాడి జరిగింది. సెల్ఫీ ఇవ్వలేదని కొంతమంది దాడిచేసినట్లు ప్రచారం జరిగింది. కానీ దీనివెనుక వేరే వ్యవహారం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
సెల్ఫీ ఇవ్వలేదని దాడి అన్నారు..
ఫిబ్రవరి 16న యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై ముంబైలో దాడి జరిగింది. దాడి కేసు అటు క్రికెట్ వర్గాలతోపాటు ఇటు ముంబై సర్కిల్స్‌లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. పృథ్వీషాతో పాటు అతడి స్నేహితుడిపై ముంబైలో దాడి జరిగింది. షా కూర్చొని ఉన్న కారు అద్దాలను బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు దుండగులు. సెల్ఫీ అడిగితే నిరాకరించడమే ఈ దాడికి కారణంగా పృథ్వీషా, అతని ఫ్రెండ్ తెలిపారు. తన ఫ్రెండ్ ఆశిష్ సురేంద్రతో కలిసి పృథ్వీ షా డిన్నర్ చేసేందుకు ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాడని, షాను గుర్తించిన ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దానికి ఈ యంగ్ క్రికెటర్ నిరాకరించడంతో వారు మరికొందరితో వచ్చి సెల్ఫీ ఇవ్వాలని మళ్లీ పట్టుబడ్డారట. దీంతో విసుగుచెందిన పృథ్వీ షా ఇక్కడికి డిన్నర్ చేయడానికి వచ్చానని, ఇబ్బంది పెట్టొద్దని సూచించాడట. ఎంతకీ మాట వినకపోవడంతో విషయాన్ని హోటల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడట పృథ్వీషా. అక్కడికి చేరుకున్న మేనేజర్ సంబంధిత వ్యక్తులను హోటల్ నుంచి బయటకు పంపించివేశారని çపృథ్వీ షా వైపు నుంచి వైపు నుంచి వచ్చిన మాటలు. సెల్ఫీ ఇవ్వకుండా, హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడని ఆగ్రహానికి గురైన గ్యాంగ్.. షా బయటకు వచ్చేవరకు వెయిట్ చేసింది. అతను బయటకు వచ్చే సమయానికి బేస్ బాల్ బ్యాట్లతో రెడీగా ఉన్నారట. పృథ్వీ షా వెళ్తున్న కారును చేజ్ చేసి బేస్‌బాల్ బ్యాట్‌తోనూ క్రికెటర్‌పై అటాక్ చేసే ప్రయత్నం చేశారు. 50 వేలు రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.50 వేలు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
షా వేదించాడని మహిళా ఆరోపణ..
ఇదిలా ఉంటే… పృథ్వీషా, అతని స్నేహితులు తనను లైంగికంగా వేధించారని అరెస్ట్ అయిన వారిలో ఒకరైన సప్నా గిల్ అనే మహిళ ఆరోపిస్తోంది. షా చేతిలో రాడ్ పట్టుకుని ఉన్నాడని.. అతనే తమపై దాడికి ప్రయత్నించాడని చెబుతోంది. ఇక మెడికల్ టెస్టుల కోసం వెళ్లేందుకు సప్నాను పోలీసులు అనుమతించలేదని ఆమె లాయర్ అలీ కషిఫ్ ఖాన్ చెబుతున్నారు. అయితే నిజంగానే సెల్ఫీ కోసం వాగ్వాదం జరిగి దాడి చేశారా..? లేక సప్నా చెబుతున్నట్లు ముందు పృథ్వీ షా, అతని ఫ్రెండ్స్ ఆమెను వేధించారా అన్నది తేలాల్సి ఉంది.
ఆసక్తిగా షా స్టోరీ..
ఈ వివాధం నేపథ్యంలో 20 రోజుల తర్వాత క్రికెటర్ పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లోకి వెళ్లి ఇలా రాశాడు. ‘కొంతమంది మిమ్మల్ని ఎంత ఉపయోగించుకోగలిగితే అంత మాత్రమే ప్రేమిస్తారు. వారి విధేయత ప్రయోజనాలు ఎక్కడ ఆగిపోతుంది‘ అని రాశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ పోస్ట్ అతని పుకారు స్నేహితురాలు నిధి తపాడియా కోసం అని ఊహించారు. షా పోస్ట్ తర్వాత, నిధి ఇన్‌స్టా్టగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది, ‘మీరు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు.. మీరు దేవుడికి అబద్ధం చెప్పలేరు’ అని అందులో ఉంది.
గత నెల జరిగిన వివాదంతో షా, నిధి మధ్య అగాధం ఏర్పడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇద్దరూ ఇలా పోస్టులు పెట్టారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.