Homeజాతీయ వార్తలుBRS MLA Harassment : రసిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. సర్పంచ్ పై మనసు పడ్డాడు.. ఇలా...

BRS MLA Harassment : రసిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. సర్పంచ్ పై మనసు పడ్డాడు.. ఇలా అడ్డంగా దొరికిపోయాడు

BRS MLA Harassment  : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఇవ్వాళ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ధర్నా చేస్తోంది.. కానీ ఆ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మాత్రం సొంత పార్టీ మహిళా ప్రజాప్రతినిధులను కోరిక తీర్చమంటూ వలపు వల విసురుతున్నారు. అంతేకాదు బంగారం, డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. వారిని లైన్లో పెట్టేందుకు ఇతర మహిళ ప్రజా ప్రతినిధులతో రాయబారం పంపుతున్నారు.. ఇలా ఓ మహిళా సర్పంచ్ కు రాయబారం పంపి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కొంటె ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన కురసపల్లి నవ్య గత ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచింది. చూసేందుకు అందంగా ఉండడంతో ఆమె నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నవ్య మీద మనసు పడ్డాడు. అసలే కొంటె ఎమ్మెల్యేగా పేరు పొందడంతో ఆమెను ముగ్గులోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు.. వర్కౌట్ కాకపోవడంతో తనకు అత్యంత సన్నిహితురాలు అయిన ఓ మహిళ ప్రజా ప్రతినిధిని రంగంలోకి దింపాడు. ఆమె ద్వారా రాయ” బేరం” పంపాడు. ” నవ్య నువ్వు చూసేందుకు అందంగా ఉంటావు.. ఆడవాళ్లే నిన్ను చూసి అసూయపడతారు. అలాంటిది ఆ ఎమ్మెల్యే నిన్ను చూశాడు. మనసుపడ్డాడు. షాపింగ్ అని చెప్పి బయటకు రా. సార్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను. బంగారం, డబ్బులు ఇస్తాడు.ల్ ఒక్కసారిగా నీ ముఖచిత్రమే మారిపోతుంది. గతంలో నేను ఆ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లిన దానినే. నన్ను ఆయన బాగా చూసుకుంటాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఆయనే. ఆడవాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన చాలా లోతుగా అర్థం చేసుకుంటాడు” అని సదరు మహిళా ప్రజాప్రతినిధి నవ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయినప్పటికీ నవ్య లొంగలేదు.

ఇక ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ అవుతున్నది. నిజానికి నవ్యకు రాజకీయాలంటే ఆసక్తి లేదు. గత ఎన్నికల్లో భర్త ప్రవీణ్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. సర్పంచ్ గా ఎన్నికయ్యారు. కానీ అదే ఆమెకు శాపంగా మారింది. మొదటినుంచి ఆమె మీద మనసు పడ్డ ఎమ్మెల్యే.. ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. బిల్లులు ఇవ్వకుండా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా చేశాడు. కనీసం ఆమెను పార్టీ కార్యక్రమాలకు కూడా చేసాడు. మండల ప్రజా పరిషత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే పట్టించుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. చివరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా ఆమెకు ఆహ్వానం లేదు. ఎమ్మెల్యే తీరుపై కేసీఆర్, కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు సదరు సర్పంచ్ సమయత్తమవుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version