Smart Money Spending: డబ్బు మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. డబ్బు లేకపోతే ప్రపంచం ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు లేకపోతే ఆహారం కూడా దొరకదు. అయితే మనిషి అవసరాలకు డబ్బు ఉండాలి. కానీ డబ్బు కోసం మనిషి జీవితాన్ని పణంగా పెట్టే ప్రయత్నం చేయకూడదు. అంటే మనిషి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలి. అలా సంపాదించిన డబ్బును ప్రణాళిక ప్రకారంగా మాత్రమే ఖర్చు చేయాలి. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే జీవితం చిన్న భిన్నం అయిపోతుంది. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఎక్కడ పొదుపు చేయాలి? ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి? అనే విషయాలు తెలిపేందుకు ఈ స్టోరీని తెలుసుకోండి..
ఫుట్ బాల్ క్రీడ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ క్రీడలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Sadio Maane గురించి ఫుట్బాల్ క్రీడాకారులకు తెలిసే ఉంటుంది. ఆఫ్రికా దేశానికి చెందిన ఈ ప్లేయర్ ఎంతో కష్టపడి ఫుట్బాల్ క్రీడలో రాణించాడు. ఒకప్పుడు కడు పేదరికంలో ఉన్న అతడు.. ఇప్పుడు బిలియనీర్ స్థాయికి ఎదిగాడు. నిత్యం కోట్లలో సంపాదన ఉన్న అతడి చేతిలో ఎప్పుడూ పగిలిపోయిన ఫోన్ కనిపిస్తుంది. కొందరు చేతిలో ఇలా పగిలిపోయిన ఫోను ఎందుకు పట్టుకుంటున్నావని అడిగారు. దానికి ఆయన సమాధానం ఏం చెప్పాడంటే?
Also Read: Money Savings : డబ్బు నిల్వ పెరిగేందుకు సింపుల్ చిట్కాలు ఇవే..
నేను పేదరికంలో పుట్టాను. ఎన్నో కష్టాలను చూశాను. చిన్నప్పటి నుంచి నాకు తిండి దొరకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో డబ్బు విలువ తెలిసింది. మనిషి జీవితాన్ని నడిపే డబ్బును పొదుపుగా వాడుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయకుండా.. అవసరమైన వాటికే ఖర్చులు చేయాలి. అప్పుడే మనకు డబ్బు విలువ తెలుస్తుంది. నా దృష్టిలో మొబైల్ అనేది అనవసరపు అయిన వస్తువు. అయితే కమ్యూనికేషన్ కోసం మొబైల్ వాడక తప్పడం లేదు. అయితే అనుకోకుండా ఇది పగిలిపోయింది. కానీ దీనికోసం ప్రత్యేకంగా డబ్బు ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. అందుకే ఈ పగిలిన ఫోన్లో అలాగే పట్టుకొని తిరుగుతున్నాను. నేను కొన్ని డాలర్లతో ప్రత్యేకంగా స్కూలు కట్టించాను. నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు రెండు విమానాలు కొనుగోలు చేయగలను. కానీ కొత్త ఫోను మాత్రం కొనుగోలు చేయలేను అని చెప్పాడు.
దీనిని బట్టి తెలిసింది ఏంటంటే అనవసరపు ఖర్చులకు చేయకుండా.. అవసరమైన వాటికి మాత్రమే డబ్బును వెచ్చించాలి. అలా చేయడంవల్ల ఎంతో డబ్బును పొదుపు చేసిన వారవుతారు. అంతేకాకుండా డబ్బు విలువ తెలిసి కాపాడుతూ ఉంటారు. ఇలా పొదుపు చేసిన డబ్బు భవిష్యత్తులో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. లేకుంటే దుబారా ఖర్చులు చేయడం వల్ల డబ్బు దొరకకుండా పోతుంది. ఫలితంగా జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల డబ్బు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.