Sleep : రోజంతా పనులు చేసి అలసిపోయిన వారు కాస్తంత నిద్రపోవాలని అనుకుంటారు. కంట పాటు కొనుక్కుతిస్తే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ప్రశాంతమైన నిద్ర ఉంటేనే మనసు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ఉంటుంది. నిద్ర భంగం కలిగితే మనసు ఏదో కోల్పోయినట్లు కనిపిస్తుంది. అలాగే నేటి కాలంలో చాలామంది రకరకాల ఒత్తిడితో ఉంటున్నారు. ఇదే సమయంలో రోజంతా పనిచేసిన సమయాన్ని అలాగే మనసులో ఉంచుకోవడంతో రాత్రి కలల రూపంలో అవి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇవి గుర్తుకు వచ్చినప్పుడు కొందరు నిద్రలో వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొందరు నిద్రలో నవ్వుతూ ఉంటారు. అయితే నిద్రలో నవ్వడం వల్ల ఏదైనా సమస్యనా? అసలు నిద్రలో నవ్వితే ఏమవుతుంది?
Also Read : భూకంపం వస్తే గాల్లో తేలిపోవచ్చు.. జపాన్ అద్భుత ఆవిష్కరణ
సాధారణంగా చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రలో నవ్వుతూ కనిపిస్తారు. అయితే వీరు రకరకాల వ్యక్తులను చూచి ఉండడం వల్ల వారు పొద్దంతా నవ్విస్తూ ఉండటం వల్ల అదే ఆలాపనతో నిద్రలో నవ్వుతూ ఉంటారు. కానీ కొంతమంది పెద్దవారు సైతం నిద్రలో నవ్వుతూ కనిపిస్తారు. ఇలా విచిత్రంగా నిద్రలో నవ్వుతూ కనిపిస్తే దానిని పారాసోమ్నియా అనే సమస్య ఉందని అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో సాధారణ సమయంలో కూడా విచిత్రమైన మార్పులు కనిపిస్తాయి. అలాగే కొందరిలో స్లీప్ లాఫింగ్ అనే న్యూరాలజికల్ కండిషన్ ఉండడం వల్ల నిద్రలో నవ్వుతూ ఉంటారు. పార్కింగ్ సన్స్, మల్టిపుల్ క్లిరోసిన్ వంటి సమస్యలు ఉన్నవారు సైతం నిద్రలో నవ్వుతూ ఉంటారు. అలాగే రోజంతా ఒత్తిడితో కూడుకొని ఉన్నవారు.. వివిధ రకాల పనులు చేసిన వారు సైతం నిద్రలో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అయితే నిద్రలో వచ్చే నవ్వు తో ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఇది పదేపదే ఉంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా వంశపార్యపర్యంగా కూడా ఇలాంటి సింటమ్స్ ఉంటాయి. కొందరు నిద్రలో నవ్వడం మాత్రమే కాకుండా మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు ఏడుస్తూ ఉంటారు. అయితే మెదడు ఎదుగుతున్న సమయంలో మీరు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎక్కువగా ఒంటరితనం భరించేవారు.. సమాజంలో ఎక్కువగా తిరుగని వారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని చెబుతున్నారు.
నిద్రలో నవ్వడం సమస్య కాకపోయినా ఇది పదేపదే ఉండడం వల్ల మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది. కొన్ని రకాల కౌన్సిలింగ్ ద్వారా ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రతిసారి నిద్రలో నవ్వుతూ ఉండడం వల్ల తోటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడితో బాధపడేవారు.. మానసికంగా ఆందోళనలతో ఉన్నవారు.. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇది ఎక్కువగా కాకుండా ఉండడానికి తక్కువగా సమస్య ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి పరిష్కారం గురించి ఆలోచించడం మంచిది. లేకుంటే ఇది వేరే దానికి వెళుతుంది. ఆ తర్వాత రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా నిద్రలో నవ్వినా లేదా మాట్లాడిన వెంటనే మానసిక వైద్యులకు చూపించడం మంచిది.