Sitting Health Problems: ఒకప్పుడు ప్రతి ఒక్కరూ శారీరకంగా కష్టపడేవారు. అందుకు తగిన ఆహారం తీసుకునేవారు. దీంతో వీరు నిత్యం ఆరోగ్యంగా ఉండేవారు. అయితే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు సులభంగా చేయగలుగుతున్నారు. కానీ ఇదే సమయంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. శారీరక శ్రమ తగ్గడం ఒకరకంగా మంచిదే అయినా.. ఆరోగ్యపరంగా మాత్రం అనేక సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి పనిని కంప్యూటర్ ద్వారా చేయడం వల్ల ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుంది. ఉబకాయం, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే వీటి నివారణకు వ్యాయామం చేయడం మంచిదని ఎంతోమంది వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయడం సాధ్యం కాకపోతే.. ఈ చిన్న పని అయినా చేసినా లాభమేనని అంటున్నారు. అదేంటంటే?
Also Read: వైఫల్యాల నుంచి కోటి రూపాయల విజయం.. ఒక కల నెరవేరిన కథ
కూర్చొని పనిచేసే వారిలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అయితే ఉదయం లేచి వ్యాయామం చేసే వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఉదయమే విధుల్లోకి వెళ్లడం.. బద్ధకంగా ఉండడం.. రాత్రిలో ఎక్కువసేపు మెలకువతో ఉండటంతో ఉదయం ఆలస్యంగా లేవడం.. వంటి కారణాలతో వ్యాయామం చేయడం సాధ్యం కాదు. దీంతో బరువు సమస్యతో బాధపడుతున్నారు.
అయితే ఎక్కువగా కూర్చుని పని చేసేవారు సైతం ఇలా వ్యాయామం చేయడం సాధ్యం కానప్పుడు.. ఒక చిన్న పనిని అలవాటు చేసుకోవాలని ఉంటున్నారు. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారు కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు లేచి నిల్చోవాలని అంటున్నారు. పదేపదే నిల్చడం వల్ల రక్తప్రసరణ మెరుగయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీని ద్వారా గుండె సమస్యలను కొంతవరకు నివారించవచ్చని చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారి కంటే.. ఎక్కువసేపు నిల్చోని పనిచేసే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల ఏదో ఒక కారణంతో ప్రతిసారి నిల్చునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.
ALso Read: కత్తిరించిన గోర్లు, వెంట్రుకలను తొక్కితే ఏమవుతుంది?
ముఖ్యంగా మహిళలు ఎక్కువగా నిల్చోని పనిచేయడం వల్ల బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారిలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిరోజు వ్యాయామం చేసినా.. గంటల తరబడి కూర్చుంటే ఎలాంటి పరిష్కారం ఉండదని అంటున్నారు. ప్రతిసారి లేచి నిల్చడం వల్ల రోజూ వ్యాయామం చేయకపోయినా పర్వాలేదని చెబుతున్నారు. దీనిపై కొంతమంది వైద్యులు పరిశోధనలు చేసి నిరూపించారు. ఎక్కువసార్లు నిల్చొని పనిచేసే వారిలో సిస్టం రక్తపోటు 3 mm కన్నా ఎక్కువగా తగ్గిందని.. దయా స్టాలిక్ రక్తపోటు 2 mm కన్నా ఎక్కువగా తగ్గినట్లు తేలిందని కొందరు వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు. రెండిటి మధ్య భేదం తక్కువగానే ఉన్నా.. దీర్ఘకాలంలో ఎంతో మేలు చేస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు కూర్చొని పనిచేసేవారు కనీసం 30 నిమిషాలకు ఒకసారి అయినా లేచి నిలబడాలని అంటున్నారు..