Paracetamol: ఒంట్లో కాస్త నలతగా ఉన్నా.. కాస్త జ్వం వచ్చినట్లు అనిపించినా చాలా మంది వెంటనే టాబ్లెట్లు వేసుకుంటారు. వైద్యుల సలహా తీసుకోకుండానే మెడికల్ షాప్‌నకు వెళ్లి గోలీలు తెచ్చుకుంటారు. చాలా మంది పారాసెటమాల్ వాడుతుంటారు. ఇక కరోనా తర్వాత దాదాపు అందరి ఇళ్లలలో పారాసెటమాల్ ట్యాబెట్లు స్టాక్ ఉంటున్నాయి. దీంతో తలనొప్పి వచ్చినా.. జ్వరంగా ఉన్నా.. జలుబు, దగ్గు ఉన్నా వెంటనే ఓ గోలీ వేసుకుంటున్నారు. అయితే పారాసెటమాల్ అధికంగా వాడడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్‌తోపాటు యాంటిబయాటిక్స్ ఎక్కువగా వాడొద్దని సూచిస్తున్నారు.
ఇష్టానుసారం వాడకం..
వైద్యుల సలహాలేకుండా ఏ ట్యాబ్లెట్ వాడొద్దు. కానీ, ఇటీవల తామే డాక్టర్లం అన్నట్లు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రటనలు చూసి మందుల దుకాణాలకు వెళ్లి ట్యాబ్లెట్లు కొంటున్నారు. సమస్య తరాగానే గోలీలు మింగుతున్నారు. అయితే జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకున్న తర్వాత వెంటనే తగ్గదు. దీంతో మరో గోలీ వేసుకుంటున్నారు. జ్వరం వచ్చిన 4 నుంచి 6 గంటల తర్వాత పెద్దలు 650 ఎంజీ, 12 ఏళ్లకన్నా తక్కువ వయసువారు 150 ఎంజీ పారాసెటమాల్ తీసుకోవచ్చు. ట్యాబ్లెట్ వేసుకున్న అరగంట తర్వాత అది ప్రభావం చూపుతుంది. కానీ, విషయం తెలియక చాలా మంది ఇష్టానుసారం మింగుతున్నారు.
పరిమితికి మించితే..
పారాసెటమాల్ టాబ్లెట్లు పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపలో నొప్పి, అలర్జీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పారాసెటమాల్ లాంటి గోలీల్లో స్టెరాయిడ్స్ ఉంటాయని, ఎక్కవగా తీసుకుంటే మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలు, కాలేయ సంబంధ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను వాడొద్దని సూచిస్తున్నారు.
త్వరగా తగ్గాలని ఓవర్‌డోస్..
చాలా మంది త్వరగా జ్వరం తగ్గాలని యాంటీ బయాటిక్స్ వాడతారు. ఓవర్ డోస్ తీసుకుంటారు. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. బ్యాక్టీరియా, వైరస్, యాంటీ బయాటిక్స్‌కు అలవాటు పడి మొండిగా మారతాయని హెచ్చరిస్తున్నారు. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతనే ఏ మైందులైనా వాడడం మంచిదని పేర్కొంటున్నారు.