https://oktelugu.com/

Mohan Babu: మోహన్ బాబుకు సినిమా ఆఫర్లు ఎందుకు రావడం లేదు?

మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినా.. ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదనే టాక్ ను మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఈయన కెరీర్ కు ఏమైంది అనే సందేహాలు కూడా ఉన్నాయి. నిజానికి మోహన్ బాబు టాలెంట్ ఉన్న నటుడు.

Written By: , Updated On : March 6, 2024 / 11:46 AM IST
Mohan Babu

Mohan Babu

Follow us on

Mohan Babu: చాలా మంది హీరోహీరోయిన్ లు చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వారి హవా కొనసాగిస్తారు. కానీ కొందరు మాత్రం కొన్ని రోజుల, నెలలు,సంవత్సరాల తర్వాత వారి ఉనికిని కోల్పోతారు. ఇంకొంత మంది హిట్ లు ఉంటే స్టార్లుగా ఎదిగి వరుస ఫ్లాప్ లు రాగానే ఫేడ్ ఔట్ అయిపోతారు. ఇక వయసును బట్టి కూడా కొందరు సైలెంట్ అయిపోతారు. కొందరు హీరోలు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారి హవా కొనసాగిస్తారు. జగపతి బాబు లాంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సూపర్ సక్సెస్ లను అందుకుంటూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు.

కానీ మోహన్ బాబు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినా.. ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదనే టాక్ ను మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఈయన కెరీర్ కు ఏమైంది అనే సందేహాలు కూడా ఉన్నాయి. నిజానికి మోహన్ బాబు టాలెంట్ ఉన్న నటుడు. కానీ ఈయన నటనను వాడుకోవాలంటే మామూలు విషయం కాదంటారు. కేవలం పెద్ద దర్శకులు మాత్రమే మోహన్ బాబుతో వర్క్ చేయగలరు అనే టాక్ ఉంది. కుర్ర దర్శకులు మోహన్ బాబుతో ఎందుకో సినిమా చేయడానికి భయపడుతున్నారు అని కామెంట్లు వస్తున్నాయి.

ఈయనను హాండిల్ చేయాలంటే పెద్ద దర్శకుల వల్లే అవుతుందట. ఈయనకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ గా ఫేస్ మీదనే చెప్పేస్తారు. అడిగేస్తారు. అందుకే సఫర్ అయ్యే పరిస్థితులను ఎవరు తెచ్చుకోవడం లేదట. ఇలా మోహన్ బాబుతో సినిమా చేసేకంటే ఇతర ఆర్టిస్టులతో సినిమాను తెరకెక్కించడం బెటర్ అనుకుంటున్నారట కొందరు.

కానీ మోహన్ బాబు నటిస్తే ఆ సినిమా రేంజ్ కూడా మారిపోతుంది. ఈ స్టార్ నటించే సినిమాలు మంచి హిట్ లను సొంతం చేసుకుంటాయి. కానీ ముక్కుసూటి తనమే ఆయనకు సినిమా ఆఫర్లు రాకుండా చేస్తుంది అని అంటారు కొందరు. అందుకే మోహన్ బాబు సినిమాలు చేయడం లేదట.. మరి ఇప్పటికైనా ఆయనకు ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.