Trust Someone or Not: ప్రస్తుత సమాజంలో ఎవరు మంచివారు..? ఎవరు చెడ్డవారో..? తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా ఉండి నమ్మకద్రోహం చేసే విధంగా తయారవుతున్నాడు. దీంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఒక్కోసారి ఎవరో ఒకరు స్నేహితులుగా మారవచ్చు. మీరు మంచి వారి కావచ్చు.. చెడ్డవారు కావచ్చు. అయితే ఒకవేళ చెడ్డవారు అయితే వారి నుంచి తప్పించుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించాలి. అందుకోసం కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో…? ఈ కోతి కథ తెలుపుతుంది. ఆ స్టోరీ ఏంటంటే?
ఒక సరస్సులో ఒక మొసలి జీవిస్తుంది. అయితే దీనికి కోతి స్నేహంగా మారుతుంది. ఈ రెండు జంతువులు సరదాగా ఉండగలుగుతాయి. ఒక్కోసారి కోతిని ఎక్కించుకొని మొసలి సరస్సు మొత్తం తిప్పుతూ ఉంటుంది. అయితే ఒకసారి మొసలి భార్య కోతి గుండె కావాలని కోరుతుంది. దీంతో భార్య కోరిక తీర్చడానికి తనతో స్నేహం చేసే కోతి గుండెను ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే కోతితో స్నేహం ఉన్న మొసలి ఒకరోజు తనపై ఎక్కించుకొని వెళ్తుంది. ఇదే సమయంలో తనను ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ.. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను.. నీ గుండె కావాలని మా భార్య అడిగింది అని చెబుతోంది. అయితే ఇది విన్న కోతికి భయం అయింది. కానీ చాకచక్యంగా ఒక ఉపాయాన్ని ఆలోచించింది. ఆ తర్వాత మొ సలితో కోతి ఇలా అంది.. నా గుండె చెట్టు మీదనే విడిచిపెట్టి వచ్చాను.. దానిని తీసుకొని వెళ్దామని అంటుంది. ఇది నమ్మిన మొసలి తిరిగి ఆ చెట్టు కాడికి కోతిని తీసుకెళ్తుంది. ఆ చెట్టు రాగానే కోతి వెంటనే చెట్టు ఎక్కి వెళ్ళిపోతుంది.
ఇక్కడ ఎంతో స్నేహంగా ఉండే మొసలి తన భార్య కోసం కోతిని చంపాలని అనుకుంది. అలాగే సమాజంలో కూడా కొందరు స్నేహంగా ఉంటూనే వెన్నుపోటు పొడవాలని చూస్తారు. అయితే సమాజంలో ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి. వారితో స్నేహంగా ఉంటూనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా మంచివారు ఇలా నటించేవారు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు వారి గురించి తెలుసుకుంటూ ఒకవేళ వారు బ్యాడ్ పర్సన్ అని తెలిస్తే వెంటనే దూరంగా ఉండడం మంచిది. అవసరమైతే కొత్త స్నేహం చేసినా పర్వాలేదు.. కానీ నచ్చని వ్యక్తితో మాత్రం జీవితం కొనసాగించొద్దు. ఎందుకంటే అలాంటి వ్యక్తితో ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుంది.
అయితే అందరూ ఇలా ఉంటారని కాదు.. కొందరు మంచివారు కూడా ఉండొచ్చు. వారిని గుర్తించి వారితో స్నేహం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు.