Child Rearing : పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రకృతిలో రెండు నెలల సమయం గడపాల్సిందేనా?

పిల్లలు పాజిటివ్, అద్భుతమైన విషయాలను అనుభూతి చెందాలంటే జీవాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారికి పరిచయం చేయాలి అంటారు. పుస్తకాల వల్ల జ్ఞానం వచ్చినా దాని ప్రతిరూపం చూస్తేనే వారికి మరింత సహాయపడుతుంది. ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తేనే వారి ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు చురుకుగా ఉంటాయి అంటారు నిపుణులు.

Written By: NARESH, Updated On : April 15, 2024 11:49 am

Child Rearing

Follow us on

Child Rearing : పిల్లల మనసు చాలా సున్నితమైనది. తల్లిదండ్రుల ప్రవర్తన వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొని వస్తుంది. ఇల్లు, ఇంట్లో ఉండే రంగులు, వస్తువులు కూడా పిల్లల మెదడు, మనసు మీద ప్రభావం చూపిస్తుంటాయి. ప్రస్తుత వాతావరణం, కాలుష్యం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఆహారం, వాతావరణ మార్పులు, స్వచ్ఛమైన గాలి లేకపోవడం సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అయితే మీ పిల్లల కోసం మీరు ఏం చేయాలి?

పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరానికి కనీసం రెండు నెలల పాటు అయినా పట్టణానికి దూరంగా వెళ్లాలి అంటున్నారు నిపుణులు. బొరియల్లాంటి ఇల్లు, లేదంటే పక్షి గూటి లాంటి ఇంట్లో ఉంటూ సిటీ వాతావరణంలో వారి ఆరోగ్యాన్ని పాడుచేయవద్దు అంటున్నారు. అందుకే కనీసం రెండు నెలల పాటు అయినా సిటీని విడిచిపెట్టి ప్రకృతిలోకి వెళ్లాలి అని సలహా ఇస్తున్నారు. అంటే ఓ రెండు నెలల పాటు సిటీకి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలన్నమాట.

ప్రకృతి ఉండే చోటు మీకు ఎలాంటి వసతి లేకపోతే.. టెంట్ వేసుకొని గడిపినా బెటర్ కానీ ప్రకృతిలో పిల్లలు ఒక రెండు నెలలు అయినా గడపాల్సిందే అంటున్నారు నిపుణులు. పిల్లలు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, సమతుల్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ పని చేయాల్సిందేనట.

పిల్లలకు ఎలాంటి విషయాలను పరిచయం చేయాలి అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలట. అనుభవం మాత్రమే వారితో నిలిచి ఉంటుంది కానీ, బోధనలు కాదు అంటారు నిపుణులు. పిల్లలు పాజిటివ్, అద్భుతమైన విషయాలను అనుభూతి చెందాలంటే జీవాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారికి పరిచయం చేయాలి అంటారు. పుస్తకాల వల్ల జ్ఞానం వచ్చినా దాని ప్రతిరూపం చూస్తేనే వారికి మరింత సహాయపడుతుంది. ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తేనే వారి ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు చురుకుగా ఉంటాయి అంటారు నిపుణులు.