https://oktelugu.com/

Short Girls: అబ్బాయిలకు పొట్టిగా ఉండే అమ్మాయిలంటే ఎందుకు ఇష్టమో మీకు తెలుసా?

ఎక్కువ ఎత్తు ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. అసలు పొట్టిగా ఉన్న అమ్మాయిలని ఇష్టపడటానికి కారణం ఏంటి? ఎత్తుగా ఉండే అమ్మాయిలకు ఎందుకు అంతగా అబ్బాయిలు ఆకర్షితులు కారో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 2, 2024 / 03:26 PM IST

    short girl

    Follow us on

    Short Girls: అమ్మాయిలు ఫిట్‌గా, అందంగా ఉంటేనే అబ్బాయిలకు నచ్చుతారు. ఎక్కువ శాతం మంది అబ్బాయిలకి అందంగా, కరెక్ట్ ఫిగర్‌లో ఉండే అమ్మాయిలే నచ్చుతారు. ఒక అమ్మాయిని ప్రేమించాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలని అనుకున్న మొదట అమ్మాయిలో అందాన్నే చూస్తారు. ఎందుకంటే వారి క్యారెక్టర్ అనేది ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. అయితే కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిలకు నచ్చుతారు. ముఖ్యంగా ఎక్కువ ఎత్తు ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడతారని నిపుణులు చెబుతున్నారు. అసలు పొట్టిగా ఉన్న అమ్మాయిలని ఇష్టపడటానికి కారణం ఏంటి? ఎత్తుగా ఉండే అమ్మాయిలకు ఎందుకు అంతగా అబ్బాయిలు ఆకర్షితులు కారో ఈ స్టోరీలో చూద్దాం.

    అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా కూడా ఎత్తుగా ఉంటే అబ్బాయిలు అంతగా ఆకర్షితులు కారు. ఎందుకంటే ఎత్తుగా ఉండే అమ్మాయిలను హగ్ చేసుకుంటే ఫీల్ ఉండదు. పొట్టిగా ఉన్న అమ్మాయిలను హగ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే అబ్బాయి కంటే అమ్మాయి కాస్త పొట్టిగా ఉంటే జోడి కూడా చూడటానికి చాలా బాగుంటుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎత్తుగా ఉండే వస్తువులను తీసుకోలేరు. దీంతో వారు భాగస్వామిని కోరుతారు. ఇలా ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఒకరి పనులు ఒకరు చేసుకోవడం వల్ల వారి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పొట్టిగా ఉన్నవాళ్లను కౌగిలించుకునేటప్పుడు అబ్బాయిలకి వారు భుజం దగ్గరికి వస్తారు. దీంతో కంఫార్ట్ కూడా ఉంటుందని అబ్బాయిలు భావిస్తారు. సాధారణంగా పొట్టిగా ఉన్న మహిళలు శృంగారంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. వీరు ఎల్లప్పుడూ సరదాగా, సంతోషంగా ఉండటంతో పాటు ప్రేమను వ్యక్తపరుస్తారట.

    ఇద్దరూ పొట్టిగా కాకుండా అబ్బాయి కాస్త ఎక్కువ హైట్‌గా, అమ్మాయి తక్కువగా ఉంటే ఆ జోడి బెస్ట్ అని చెప్పవచ్చు. వీరి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. పొట్టిగా ఉంటారు ఏమో కానీ.. వారికి తెలివి కూడా ఎక్కువగా ఉంటుందట. అన్ని విషయాలను కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ప్రతీ విషయంలో చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా పొట్టిగా ఉండే అమ్మాయిల్లో జుట్టు పొడవుగా ఉండే అమ్మాయిలను అబ్బాయలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జుట్టు ఎక్కువగా ఉంటే అమ్మాయిలు అందంగా కనిపిస్తారని భావిస్తారు. సాధారణంగా మనం ఎందరో జోడీలను చూస్తుంటాం. వీరిలో అబ్బాయిలు కాస్త హైట్ ఎక్కువ ఉండి, అమ్మాయిలు పొట్టిగా ఉన్న జోడీలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మిగతా జోడీల్లో ఎవరూ ఎంత అందంగా ఉన్నా కూడా ఇద్దరు హైట్ అయితే పెద్దగా అనిపించదు. అయితే అబ్బాయిలు పొట్టిగా ఉన్న అమ్మాయిలని ఇష్టపడటానికి ఇవేనా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. నిజంగానే అబ్బాయిలకి పొట్టిగా ఉండే అమ్మాయిలు బాగా సెట్ అవుతారనిపిస్తుందా? లేదా? మీ అభిప్రాయం ఏంటో తెలపండి.