Non-Vegetarian Women: భారత్ లో ఇప్పుడు చుక్క, ముక్క కామన్ అయిపోయింది.జనాభాలో అధికశాతం వారానికి ఒక్కసారైనా చికెన్ , మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్ ను లాంగిచేస్తున్నారు. ఒకప్పుడు వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారాన్ని జనాలు తినేవారు. ఇప్పుడూ రెండురోజులకు ఒకసారి.. కొందరూ రోజూ మాంసాహారం లేనిదే ముద్ద దిగదు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సర్వేలో భాగంగా ఏపీలో 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్యనున్న స్త్రీ, పురుషుల వివరాలు సేకరించారు. వారిలో చాలా మంది నాన్ వెజ్ కు ఓటేయడం విశేషం.
Also Read: Shubha muhuraths 2022: నాలుగురోజుల్లో ముహుర్తాలన్నీ పోతాయ్.. మళ్లీ ఆగస్టులోనే.. డేట్స్ ఇవీ
ఈ సర్వే ప్రకారం దేశంలో క్రమంగా శాకాహారుల సంఖ్య తగ్గిపోతోంది. ముఖ్యంగా పురుషుల్లో శాకాహారం తినేవారి సంఖ్య 5శాతం తగ్గింది. గతంలో 21.6 శాతంగా ఉన్న శాకాహారులు.. ప్రస్తుతం 16.6 శాతానికి తగ్గింది. మహిళల విషయానికి వస్తే 0.6 శాతం మాత్రమే మాంసాహారులు పెరిగారు.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఏకంగా నాన్ వెజ్ తినేవారి సంఖ్య భారీగా పెరగడం విశేషం. ఏపీలో 97.4 శాతం మంది పురుషులు నాన్ వెజ్ ను లాగించేస్తున్నారు. ఇక 95 శాతం మంది మహిళలు కూడా నాన్ వెజ్ తింటున్నట్టు తేలింది. నాన్ వెజ్ ప్రియుల సంఖ్య పురుషుల్లో స్వల్పంగా పెరగగా.. మహిళల్లో మాత్రం భారీగా పెరగడం విశేషం. 2015-16లో మహిళలు 71.2 శాతం నాన్ వెజ్ తింటే.. 2019-21 వరకు 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. 57 నుంచి 72 శాతానికి పెరిగారు.
పురుషులు మొదటి నుంచి మాంసాహారంపై మక్కువగానే ఉంటారు. ఇక మహిళలు కొందరు పూజలు పునస్కారాలు అంటూ వాటిని తక్కువగా తింటారు.కానీ ఇప్పుడు వారి సంఖ్యపెరగడం విశేషం. దేశంలో మాంసాహారం అత్యధికంగా వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీలో టాప్ లో ఉండడం విశేషంగా మారింది.
Also Read:Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు వైరల్