మనలో చాలామంది మాంసం తినడాన్ని ఇష్టపడతారు. కొంతమందికి ప్రతిరోజూ ఆహారంలో మాంసం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మాంసం ఎక్కువగా తినేవాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల తాజా పరిశోధనలలో మాంసం అలర్జీలకు కారణమని వెల్లడైంది. అమెరికాలో ఈ తరహా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. నాన్ వెజ్ ను ఎక్కువగా తినేవాళ్లు ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

డీడబ్ల్యూ నివేదికలో మాంసం తింటే అలర్జీ వస్తుందని వెల్లడి కావడం గమనార్హం. మాంసం తినేవాళ్లకు అలర్జీ వస్తే మాంసం తినడానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. అమెరికన్ వైద్యులు అలర్జీతో బాధ పడే రోగులు వైద్యం కోసం వచ్చారని వాళ్లు ముందురోజు మాంసం తిన్నామని చెప్పారని వైద్యులు వెల్లడించారు. వాళ్లు చెప్పిన విషయంలో అర్థం లేదని తాము భావించామని అమెరికన్ వైద్యులు పేర్కొన్నారు.
అయితే అల్గాగల్ అనే రోగిపై చేసిన పరిశోధనలలో మాంసం తినడం వల్లే అలర్జీ వచ్చిందని తేలిందని ఆ వ్యక్తి యొక్క ప్రతిరోధకాలలో అలర్జీ లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పుకొచ్చారు. తరచూ నాన్ వెజ్ తినేవాళ్లకు అలర్జీ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మాంసం ఎక్కువగా తింటే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే ఛాన్స్ ఉంటుంది.
ఉడికీఉడకని మాంసం తిన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉడికీఉడకని మాంసం తినడం వల్ల శరీరంలోకి టేప్ వార్మ్ ప్రవేశించే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఉడికించిన మాంసాన్ని మాత్రమే తినాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.