WiFi: దేశంలో స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. ప్రముఖ టెలీకాం కంపెనీలు భారీగా డాటా ఆఫర్లను ప్రకటిస్తున్నా ఎక్కువ సమయం ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్లకు డాటా సరిపోవడం లేదు. కొంతమంది ఇంటర్నెట్ కోసం పబ్లిక్ వైఫైపై ఆధారపడుతున్నారు. అయితే పబ్లిక్ వైఫై వాడటం వల్ల స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం బస్సులు, రైల్వే, మాల్స్, హోటళ్లు, ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీలు సైతం ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పబ్లిక్ వైఫైకు కనెక్ట్ కావడం వల్ల ఆ డేటా పబ్లిక్ సర్వర్ కు చేరే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డాటా లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్రీ వైఫై నెట్వర్క్ లో చేరిన వెంటనే మొబైల్ లో సైనప్ సెట్టింగ్స్ కు సంబంధించిన మెసేజ్ వస్తుంది.
సైనప్ అయిన తర్వాత మొబైల్ లొకేషన్ తో పాటు వీడియో గ్యాలరీ, కాంటాక్ట్ లిస్ట్, కెమెరా, ఫోటో గ్యాలరీకి అనుమతులు ఇస్తే మాత్రమే ఫ్రీ వైఫై కనెక్ట్ అవుతుంది. అనుమతులు ఇవ్వడం ద్వారా మొబైల్ లోని డాటా వైఫై సర్వర్ కు కాఫీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే పబ్లిక్ వైఫైకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. విశ్వసనీయ ప్రదేశాల నుంచి, వ్యక్తుల నుంచి మాత్రమే ఫ్రీ వైఫై తీసుకోవాలి.
ఉచిత వైఫై తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డాటా సర్వర్ కు చేరడం వల్ల మన వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.