Vastu Tips Goddess Lakshmi: మనం వాస్తును నమ్ముతుంటాం. అలాగే కొన్ని శకునాలు కూడా పాటిస్తుంటాం. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని భావిస్తుంటాం. ఇందులో భాగంగానే డబ్బు నిలువ ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవికి సంబంధించిన పలు చర్యలు పాటిస్తూ మనం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని అనుకుంటాం. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ కొన్ని సంకేతాలు మనకు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు తెలియజేస్తుంది. అవేంటో చూద్దాం.
ఇంట్లోకి నల్ల చీమల ధార
మన ఇంట్లోకి నల్ల చీమల ధార వస్తున్నట్లు కనిపిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తున్నట్లు గమనించుకోవాలి. అవి ఏదైనా పదార్థాన్ని తీసుకుని వస్తున్నట్లు కనిపిస్తే ఇంకా మంచిది. లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వచ్చే సందర్భంలో పలు రకాల గుర్తులు మనకు తెలియజేస్తాయి. ఇందులో భాగంగానే ఇంట్లో ఏదైనా పక్షి గూడు కట్టుకుంటే అత్యంత శుభ సూచకంగా చెబుతారు.
ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే..
ఇంట్లో అకస్మాత్తుగా ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే కూడా చాలా మంచిది. ఇది కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నందుకు శుభ సంకేతమే. దీపావళి పండగ రోజు తులసి మొక్క చుట్టు బల్లులు కనిపిస్తే కూడా మంచిదే. కొందరు బల్లులు కనిపిస్తే అపశకునంగా భావిస్తుంటారు. కానీ బల్లులు మనకు మంచి కలిగిస్తాయని వాస్తు శాస్ర్తం చెబుతోంది.
కుడి చేతిలో..
కుడి చేతి నిరంతరం దురద పుడుతుంటే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. మనకు నిద్రలో వచ్చే కలల్లో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మన సంపద పెరిగే అవకాశం ఉంటుందని గ్రహించుకోవాలి. ఇలా మనకు పలు సంకేతాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుందని అంచనా వేస్తుంటారు.
నిద్ర లేవగానే..
మనం నిద్ర లేవగానే శంఖం శబ్ధం వినిపిస్తే శుభంగా పరిగణించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరకును చూస్తే మన ఇంట్లోకి సంపద వస్తుందని భావించుకోవచ్చు. దారిలో కుక్క నోట్లో శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపిస్తే మనకు డబ్బు రాబోతోందని అర్థం. ఇలా మనకు పలు సంకేతాలు డబ్బు వస్తుందని చెప్పడానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు.