Secrets of Happiness: ఒక మనిషి జీవితాన్ని నడిపించేది మెదడు. మెదడులో ఉండే ఆలోచనలు ప్రకారమే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అతని మనసు బాగుంటే జీవితం బాగుంటుంది. మనసు ఆందోళనగా ఉంటే జీవితం కూడా ఎప్పుడూ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. వాటిని తలుచుకుంటూ బాధపడితే పరిష్కారం కావు. ఒక్కొక్కటి పరిష్కరిస్తూ ముందుకెళ్లడమే జీవితంలో ప్రతి వ్యక్తి చేసే పని. అయితే ఈ చిన్న విషయాన్ని కూడా చాలామంది గుర్తించరు. తమకు ఏదో అయిపోతుందని.. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని.. ఎప్పుడూ ఏదో ఒకటి తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. ఇలా జీవితాంతం బాధపడుతూ కుంగిపోతూ ఉంటారు. కొందరు ఇలా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే.. తమ జీవితం సంతోషంగా లేదని.. ఎప్పుడు కష్టాలతో కూడుకుందని.. చెబుతూ ఉంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరి సంతోషం వారి మనసులోనే ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
గౌతమ బుద్ధుడు ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ ఎన్నో పెద్ద సమస్యలకు పరిష్కారం చూపాడు. అలాగే ఒక వ్యక్తి ఆనందం తనలోనే ఉందన్న విషయాన్ని చెప్పాడు. ఒకరి ఆనందాన్ని ఎవరు తీసుకుపోరు.. ఎవరి ఆనందం వారిలోనే ఉంటుంది అని చెప్పాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అందుకోసం ఉదయం సాయంత్రం నిత్యం కష్టపడుతూ ఉంటాడు. అయితే ఒకవైపు డబ్బు సంపాదిస్తూనే.. మరోవైపు దుబ్బారా ఖర్చులు చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండదు. ఆ తర్వాత ఎంత కష్టపడినా డబ్బు లేదని బాధపడుతూ ఉంటాడు. తీరిక లేకుండా కష్టపడే ఆ వ్యక్తి డబ్బులు పొదుపు చేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇదే సమయంలో కొన్ని కోరికలను చంపుకోవాలి. అప్పుడు జీవితాంతం ఆనందంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా?
భార్యాభర్తల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఆడవారు తమ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ భర్త కొన్ని పనుల కారణంగా పట్టించుకోవడం మానివేస్తే.. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఆలోచించేవారు ఉన్నారు. ఇలా నెగిటివ్ ఆలోచనలతో మనసు ఆందోళనగా మారి ఆ తర్వాత గొడవలకు దారితీస్తుంది. అయితే చివరికి ఆ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నాము కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇలా నెగటివ్ ఆలోచనలు రానీయకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు.. ఒక అడుగు ముందు వేసి లాభమో.. నష్టమో అనుకోవాలి. అలా కాకుండా ఈ వ్యాపారం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి అని ఆలోచిస్తే.. ఎప్పటికీ ముందు అడుగు వేయలేరు. అంతేకాకుండా వ్యాపారం లో కొన్ని సమస్యలు ఏర్పడగానే ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజులు సహనంతో ఉండడంవల్ల వ్యాపార పరిస్థితి ఏంటని తెలిసిపోతుంది. అలాకాకుండా నిత్యం బాధపడుతూ ఉండడం వల్ల మనసు ఎప్పుడు ఆందోళనగా ఉంటుంది.
ఇలా అనేక రకాల ఆలోచనలతో చాలామంది నిత్యం బాధపడుతూనే ఉంటారు. అలా బాధపడటం కాకుండా సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచించడం నేర్చుకుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు. అంతేకాకుండా కొన్ని అనవసరమైన పనులకు దూరంగా ఉండటం వల్ల కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది.