SBI Super Offer: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బ్యాంకులు కస్టమర్లకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్నాయి. హోమ్ లోన్స్ తో పాటు ఇతర లోన్స్ పై భారీగా వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరే విధంగా స్పెషల్ స్కీమ్ ను అమలు చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ మంచి వడ్డీరేట్లను అందిస్తోంది.

గతేడాది మే నెలలో ఎస్బీఐ ‘వీ కేర్’ సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది మార్చి నెల 31వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందని ఎస్బీఐ చెబుతోంది. సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్ లో టర్మ్ డిపాజిట్ చేస్తే 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి 6.20 శాతం వడ్డీకి రుణాన్ని పొందే అవకాశం అయితే ఉండేది. అయితే ముందుగా డబ్బులను విత్ డ్రా చేయాలని అనుకునే వాళ్లు మాత్రం అదనపు వడ్డీ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యం కాదు.
ఎస్బీఐ ప్రస్తుతం సాధరణ ప్రజలు 5 సంవత్సరాల పాటు నగదు డిపాజిట్ చేస్తే వాళ్లకు 5.4 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు డిపాజిట్ చేస్తే మాత్రం 6.20 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుండటం గమనార్హం. ముందస్తుగా డబ్బు విత్ డ్రా చేస్తే 0.5 శాతం మొత్తాన్ని పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సాధారణ పౌరులు పొందే వడ్డీతో పోలిస్తే ఎస్బీఐ పెన్షనర్లు ఒక శాతం ఎక్కువ మొత్తాన్ని వడ్డీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెన్షనర్లు ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.