Jobs In SBI: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 4 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

https://sbi.co.in/web/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.
Also Read: Covid Vaccine For Children: మరో గుడ్ న్యూస్.. 12-17 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకో వ్యాక్సిన్
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (కోర్ బ్యాంకింగ్) ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (ఈ ఛానెల్స్), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
Also Read: TRS vs BJP: బీజేపీ నేతలపై కేసులు..? టీఆర్ఎస్ ది కుట్రపూరితమేనా?