Shane Warne: క్రికెట్ చరిత్రలో కొందరికి ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో వారి మాయ, వారి అద్భుతమైన ఆట గురించి ఉంటుంది. అలాంటి పేజీలను లెక్కలేనన్ని క్రియేట్ చేసుకున్న మాయావి ది గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్నర్. ఎవరైనా మాటలతో మాయ చేస్తారు.. కానీ ఇతను మాత్రం బంతి తోనే మాయ చేసి బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టిస్తాడు. ఆల్మోస్ట్ వైడ్ గా పడుతుంది అనుకున్న బాల్ కూడా గింగిరాలు తిరుగుతూ మిడ్ స్టంప్ ను లేపేయడమే వార్నర్ ప్రత్యేకం. ఇప్పటి తరానికి ఈయన పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1990 కిడ్స్ కి మాత్రం ఆయన క్రికెట్ సూపర్ స్టార్. అంతెందుకు మీరు ఇప్పటికైనా యూట్యూబ్ లోకి వెళ్లి వార్నర్ గ్రేట్ బాల్ అని టైప్ చేసి చూడండి.. మీ కళ్ళను కూడా నమ్మలేని స్పిన్ మాయాజాలం ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఒక్కసారి చూశారంటే అలాంటి వీడియోలు పదేపదే చూస్తూ అలా ఉండిపోతారు.. అదే షేన్ వార్నర్ మాయ.

అలాంటి లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో లోకాన్ని విడిచి వెళ్లారు. థాయింలాండ్ లోని తన విల్లాలో నిన్న అచేతనంగా పడి ఉన్న షేన్ వార్న్ ను అతడి సిబ్బంది గుర్తించి, వెంటనే ఆస్నత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మాయావి గురించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?
ఆస్ట్రేలియా క్రికెట్ టీం తరఫున 1992 నుండి 15 సంవత్సరాల పాటు బౌలర్ గా రాణించిన షేన్ వార్న్… 145 టెస్టు మ్యాచుల్లో 708 వికెట్లు తీశాడు. ఒక మ్యాచులో 12 వికెట్లు తీసి, ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా 8 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. అటు వన్డే మ్యాచుల్లో 293 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వార్న్ చేసిన రికార్డ్ ఇప్పటికీ అలానే ఉంది. టెస్టు మ్యాచుల్లో 37 సార్లు 5 వికెట్లు… పదిసార్లు 10 వికెట్లు తీసిన ఘటన స్పిన్ మాంత్రికుడికే దక్కింది. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తొలి ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)ను ఛాంపియన్‌గా నిలిపిన ఘనత షేన్ వార్న్‌కే దక్కుతుంది. కెప్టెన్, మెంటర్‌గా రాజస్థాన్ రాయల్స్ గెలుపులో వార్న్ కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించి మరీ IPLలో రాజస్థాన్ జట్టు పగ్గాలను చేపట్టడం విశేషం. ఇటు సీనియర్లు, యువ ఆటగాళ్లను సమతూకం చేసుకుంటూ రాజస్థాన్‌కు టైటిల్‌ను సాధించి పెట్టాడు. 2011 వరకు రాజస్థాన్‌కు సారథిగా వ్యవహరించాడు.
క్రికెట్ లో తిరుగులేని రారాజు గా ఉన్న ఇతను.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు. డ్రగ్స్, మ్యాచ్ కు సంబంధించిన వివరాలు ఇతరులతో ఫిక్సింగ్ చేయడం, అమ్మాయిలకు లైంగికపరమైన మెసేజ్లు పంపించడం లాంటివి అతన్ని కొన్నిసార్లు జరిమానాలు, మ్యాచ్ నిషేధాల వరకు తీసుకెళ్లాయి. కొన్నిసార్లు ఇతర క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
షేన్ వార్న్ కెరీర్ హైలైట్స్
– ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా(1001) షేన్ వార్న్ నిలిచాడు( మొదటి స్థానంలో 1347 వికెట్లతో మురళీధరన్ ఉన్నాడు)
– 37 టెస్టుల్లో వార్న్ సాధించిన 5 వికెట్ల ఘనత. మురళీధరన్ (67) ఫస్ట్‌ప్లేస్.
– 40,705 టెస్ట్ కెరీర్ లో వార్న్ వేసిన బంతులు. మురళీధరన్ (44,039), అనిల్ కుంబ్లే (40,850) తర్వాత వార్న్ మూడో ప్లేస్ లో ఉన్నాడు.
– 1,761 టెస్టు కెరీర్ లో వార్న్ వేసిన మెయిడిన్ ఓవర్లు. మురళీధరన్ (1794) తర్వాత రెండో ప్లేస్ లో ఉన్నాడు.
– 195 టెస్టుల్లో ఇంగ్లండ్ (యాషెస్) పై వార్న్ సాధించిన వికెట్లు. ఓ అపోనెంట్ పై టెస్టు ఫార్మాట్ లో ఇప్పటివరకు ఏ బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు.
– 96 2005 లో టెస్టుల్లో వార్న్ సాధించిన వికెట్లు. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ వార్న్.
– 17 టెస్టుల్లో వార్న్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు. వసీం అక్రమ్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. జాక్వెస్ కలిస్ (23), మురళీధరన్ (19) టాప్ లో ఉన్నారు.
– 138 టెస్టుల్లో వార్న్ ఎల్బీడబ్ల్యూ వికెట్లు. కుంబ్లే (156), మురళీధరన్ (150) టాప్ లో ఉన్నారు.
– 116 టెస్టుల్లో వార్న్ క్లీన్ బౌల్డ్ చేసిన సందర్భాలు. మురళీధరన్ (167), అండర్సన్ (124) టాప్ లో ఉన్నారు.
Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్