Children Height: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేరని బాధ పడుతూ ఉంటారు. పిల్లలు ఎత్తు పెరగాలనే ఆలోచనతో మార్కెట్ లో ఎత్తును పెంచే ఉత్పత్తులు అంటూ ప్రచారం చేస్తున్న ఉత్పత్తులను సైతం కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పిల్లల డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా సులభంగా పిల్లలు ఎత్తు పెరిగేలా చేయవచ్చు.
పిల్లలు ఎత్తు పెరగాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాలు తీసుకోవడం ద్వారా పిల్లలు సులభంగా ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. పాలు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి, ప్రోటీన్లు, కాల్షియం లభిస్తాయి. చిన్నారులు ఎత్తు పెరగడంలో పాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కాల్షియం ఎక్కువగా లభించే సోయా బీన్స్, సోయా మిల్క్ తరచూ తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
తరచూ మాంసాహారం తీసుకోవడం ద్వారా ఎత్తు పెరగడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మాంసాహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించడంతో పాటు కండరాల నిర్మాణం బాగా జరుగుతుంది. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రతిరోజు గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు లభించడంతో పాటు సులువుగా ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఆకు కూరలు తినడం ద్వారా కూడా ఎత్తు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆకు కూరలు చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. పిల్లలు తరచూ బెండకాయలను తింటే కూడా హైట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవడం ద్వారా పిల్లలు ఎత్తు పెరిగే ఛాన్స్ ఉంటుంది.