Royal Enfield Super Meteor 650: కుర్రకారు నుంచి రాజకీయ నాయకులు ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను హోదాగా చూస్తున్నారు. అదిరిపోయే స్టైల్ తో పాటు అప్డేట్ ఫీచర్స్ తో ఆకట్టుకున్న ఈ బైక్స్ కు ఎప్పటికీ ఆదరణ ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తోంది. గతంలో రాయల్ ఎన్ ఫీల్డ్ 350 తో ఆకట్టుకున్న యాజమాన్యం తాజాగా ‘మీటియోర్ 650’ని రెడీ చేసింది. త్వరలో ఇది దేశీయ రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లనుంది. మరి ఈ న్యూ బైక్ ఫీచర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్ ఎప్పుడు వస్తుందా..? అని యూత్ నుంచి పెద్ద వారి వరకు అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ తరుణంలో బైక్ ప్రియులను ఆకట్టుకునే విధంగా ఇటీవల ఇటలీలోని మిలన్ లో EICMA 2022 బైక్ షో లో ‘సూపర్ మీటియోర్ 650’ ని ఆవిష్కరించారు. ఆకర్షణీయ లుక్ లో కనిపించిన ‘సూపర్ మీటియోర్ 650’ ని సొంతం చేసుకోవడానికి వాహనదారులు రెడీ అవుతున్నారు.
‘రాయల్ ఎన్ ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650’ నేటి ట్రెండ్ కు తగిన విధంగా ఫీచర్స్ ఉంచారు. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 ఇంచెస్ రియల్ వీల్ కలిగి ఉన్న ఇందులో సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ రెండూ అద్భుతంగా ఉన్నాయి. బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. టియర్ డ్రాప్ ఆకారంలో ఉన్న 15.7 లీట్ ఫ్యూయల్ ట్యాంకును అమర్చారు. సౌకర్యవంతమైన రైడర్ సీటు తో పాటు పిలియన్ కోసం స్పీట్ సీటు వంటివి ఉన్నాయి. బైక్ నెంబర్ ప్లేట్ దగ్గర ఇండికేటర్స్ అమర్చబడి ఉన్నాయి.

‘సూపర్ మీటియోర్ 650’లో ఇంజిన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంటర్ సెప్టర్, కాంటినెంటల్ జీటీ 650 ఉన్న ఇందులో 648 సీసీ ఇంజిన్ సౌకర్యవంతంగా ఉంటుంది. 7,250 ఆర్ పీఎమ్ వద్ద 47 హెచ్ పి పవర్, 5650 ఆర్ పీఎమ్ వద్ద 52 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ ను ఇస్తుంది. మిగతా బైక్ లతో పోలిస్తే 650 చాలా తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. దీని సీటు ఎత్తు 740 మిమీ. కావున దీనిని సులభంగా రైడ్ చేయవచ్చు.
‘సూపర్ మీటియోర్ 650’ చాలా క్లాసికల్ క్రూయిజర్ డిజైన్ తో ఉంది. దీని చుట్టూ ఎల్ఈడి లైటింగ్స్ అమర్చారు. రౌండ్ హెడ్ లైట్ తో పాటు, వెడల్పాటి హ్యాండిల్ బార్లు, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రియులు కొత్త బైక్ కోసం ఎదురు చూసే వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైక్ ధర గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.