Rashmika Mandanna: సోషల్ మీడియా ట్రోల్స్, నెగిటివ్ ప్రచారంపై రష్మిక మందాన సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశాడు. తన కామెంట్లో అసహనంతో పాటు హెచ్చరిక కూడా కనిపించింది. ఇన్నాళ్లు భరించాను ఇకపై సహించేది లేదని రష్మిక మందాన ఇంస్టాగ్రామ్ వేదికగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ నుండి నేను సోషల్ మీడియా వ్యతిరేకత, ట్రోల్స్ ఎదుర్కొన్నాను. చాలా కాలంగా ఈ నెగిటివిటీ నన్ను వేధిస్తోంది. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలనే నియమం లేదు. అదే సమయంలో మితిమీరి ప్రవర్తిస్తే సహించలేము.

ఈ మధ్య నేను ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు వక్రీకరించారు. నేను అనని మాటలు రాశారు. ఈ పుకార్లు నాతో పాటు నా వాళ్ళను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు తీసుకుంటాను. వాటిని పరిగణలోకి తీసుకొని నన్ను నేను మార్చుకుంటాను. మంచి ఔట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అర్థం లేని నిరాధారమైన ఆరోపణలు, విమర్శలను సహించేది లేదు. మంచిగా నటించి, పాత్రలు చేసి మిమ్మల్ని సంతోషపరచాలనేదే నా ఉద్దేశ్యం. చుట్టుపక్కల ఉన్నవారితో ప్రేమగా ఉండండి. మనం అంతా చాలా కష్టపడుతున్నాము…. అంటూ అనేక విషయాలు చర్చిస్తూ రష్మిక మందాన ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు.
రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఇద్దరూ ఒకే సమయంలో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ టూర్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక మందాన విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి మాట్లాడినట్లు కథనాలు వెలువడ్డాయి. వీటినన్నింటినీ ఉద్దేశించి రష్మిక ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది.

రష్మీక కెరీర్ బిగినింగ్ లోనే ట్రోల్స్, సోషల్ మీడియా హేట్ కి గురయ్యారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఆమె ప్రేమించారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. సడన్ గా మనసు మార్చుకున్న పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఇది రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. వారు తీవ్ర స్థాయిలో ఆమెను ట్రోల్ చేశారు . సోషల్ మీడియా వేధింపులకు దిగారు. చివరకు రక్షిత్ శెట్టి… రష్మికను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. అప్పుడు అభిమానులు ట్రోలింగ్ ఆపేశారు. మరోవైపు రష్మిక తెలుగులో పుష్ప 2 చేస్తున్నారు. హీరో విజయ్ కి జంటగా నటించిన వారసుడు 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.