
Women’s Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భారీ అంచనాలు ఉన్న జట్టు బెంగళూరు.. కానీ నిన్నటి వరకు అంచనాలను అందుకున్నది లేదు.. ఆ తీరుగా ఆడింది లేదు. అందుకే వరుస ఓటములు పలకరించాయి. చివరికి స్మృతి మందాన వంటి ప్రతిభావంతమైన ప్లేయర్ ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అసలు బెంగళూరు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తుందా? అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి.. కానీ వాటిని పటాపంచలు చేసింది ఆ టీం. బుధవారం ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి విజయం అందుకుంది. తన మీద ఉన్న కొండంత ఒత్తిడిని దించేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పెట్టకేలకు తొలి విజయం సాధించింది. యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలిచింది. టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే కెప్టెన్ నమ్మకాన్ని బెంగళూరు బౌలర్లు నిలబెట్టారు. ఈ లీగ్ లో తొలిసారిగా నిప్పులు చెరిగే బంతులు వేశారు. దీంతో ఉత్తర ప్రదేశ్ జట్టు పెద్ద స్కోర్ చేయలేకపోయింది.

బెంగళూరు బౌలర్ల దాటికి వణికిపోయిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఓపెనర్ దేవికా వైద్య (0) డక్ ఔట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హేలీ కూడా దారుణంగా విఫలమైంది. ఇలాంటి సమయంలో కిరణ్ నవగిరే (22) నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. తహేలియా మెక్ గ్రాత్ (2) విఫలమైనప్పటికీ గ్రేస్ హారేస్(46) రాణించింది. సిమ్రాన్ షేక్(2) కూడా ఆకట్టుకోలెకపోయినప్పటికీ.. దీప్తి శర్మ (22), సోఫీ ఎక్సె ల్ టోన్ (12), శ్వేతా సెహ్రావాట్(6), అంజలి శ్రావణి (8), రాజేశ్వరి గైక్వాడ్ (12) పరుగులు మాత్రమే చేయగలిగారు.. దీంతో ఆ జట్టు 135 పరుగులకే ఆల్ ఔట్ అయింది.
లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ స్మృతి (0) డక్ ఔట్ అయింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (14) పెద్దగా రాన్హించలేదు. ఫెర్రీ (10) విఫలం అయింది.. హెదర్ నైట్(24) పర్వాలేదు అనిపించింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కణికా అహుజా(46) బీభత్సమైన ఆట తీరు ప్రదర్శించింది. ఆమెకు ఏదైనా రిచా ఘోష్(31) నాట్ ఔట్ జత కలవడంతో ఆర్ సీ బీ విజయం దిశగా సాగింది. శ్రేయాంక పాటిల్(5 నాట్ అవుట్) తో కలిసి రిచా జట్టును గెలిపించింది. వరుస ఓటముల తర్వాత బెంగళూరు కు ఇది తొలి విజయం.