
Dasara Censor Review: హీరో నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది దసరా చిత్రం. దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని అంచనా. అంటే నాని గత చిత్రాల బడ్జెట్ కి ట్రిపుల్ అని చెప్పొచ్చు. కథపై నమ్మకంతో మేకర్స్ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఒక పెద్ద విలేజ్ సెట్ నిర్మించారు. దీని కోసం కోట్లు వెచ్చించారు. దసరా మూవీ ప్రధాన భాగం అక్కడే తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో నాని దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. చెన్నై, బెంగుళూరు వెళ్లిన టీం నెక్స్ట్ నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ రెండు వారాలు సినిమాను పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయనున్నారు.
కాగా దసరా సెన్సార్ జరుపుకుంది. సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. అయితే కొన్ని పదాలు మ్యూట్ చేయాలని సూచించారట. దసరా మూవీలో మాస్ విలేజ్ లేబర్ రోల్ చేస్తున్న నాని కొన్ని బూతు పదాలు వాడాడు. పాత్ర స్వభావం తెలియజేసేందుకు కస్ వర్డ్స్ ఉపయోగించారు. కాబట్టి బూతు పదాలు మ్యూట్ చేస్తే యూ/ఏ ఇస్తామని చెప్పారట. లేదంటే ఏ సర్టిఫికెట్ వస్తుంది. కారణం మూవీలో వైలెన్స్ బాగా ఉంది. ఈ క్రమంలో దసరా సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం కలదు.
ఇక సెన్సార్ సభ్యులు మూవీ పట్ల పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. దసరా చిత్రంలో హీరో నాని, కీర్తి సురేష్ ల నటన ప్రధాన హైలెట్స్ అంటున్నారు. మలయాళ నటుడు షైన్ టామ్ చక్కో మెయిన్ విలన్ పాత్ర చేస్తున్నాడు. షైన్ టామ్ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుందట. విలేజ్ పాలిటిక్స్, వర్గ పోరాటాల నడుమ ఇన్నోసెంట్, ప్యూర్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారట. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు పొందుపరిచారు.

సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యిందంటున్నారు. సాంగ్స్, బీజీఎం మెప్పిచ్చాయంటున్నారు. దసరా మూవీకి అనుకూలంగా సెన్సార్ సభ్యుల స్పందన ఉందని సమాచారం. ఇక సాధారణ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మార్చి 30న వరల్డ్ వైడ్ దసరా విడుదల కానుంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నానికి దసరా విజయం చాలా కీలకం. మరోవైపు ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి దారుణమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నారు. ఆయన తెరకెక్కించిన లయన్, పడి పడి లేచె మనసు, ఆడాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.