https://oktelugu.com/

Romance: కలయికలో పాల్గొనే ముందు ఈ పదార్థాలు తిన్నారా.. ఇక అంతే సంగతులు

కలయికలో పాల్గొనే ముందు తెలియక కొన్ని ఆహారాలను తింటారు. వీటి వల్ల శృంగారం ఫీల్‌ని ఎంజాయ్ చేయలేరని నిపుణులు అంటున్నారు. మరి కలయికలో పాల్గొనే ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2024 / 02:11 AM IST

    Romance

    Follow us on

    Romance: ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైనది. భాగస్వాముల మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు ఉన్నా సరే.. శృంగారం ఇద్దరిని ఒకటి చేస్తుంది. భార్యాభర్తలు అన్నాక మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అయితే ఫిజికల్ లైఫ్ లేకపోతే ఇద్దరి మధ్య బంధం కూడా అంతగా బలపడదు. ఆందోళన, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం బాలేకపోయిన కూడా శ‌ృంగారం అన్నింటిని బాగుచేస్తుంది. అయితే కొందరికి శృంగారం మీద తక్కువగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే చాలామంది భార్యాభర్తలు శృంగారం చేసే ముందు అసలు ప్లానింగ్ లేకుండా చేస్తారు. అయితే కొందరికి తెలియక కలయిక ముందు కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కలయికలో పాల్గొనే ముందు తెలియక కొన్ని ఆహారాలను తింటారు. వీటి వల్ల శృంగారం ఫీల్‌ని ఎంజాయ్ చేయలేరని నిపుణులు అంటున్నారు. మరి కలయికలో పాల్గొనే ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

    క్యాలీఫ్లవర్
    శృంగారంలో పాల్గొనే ముందు క్యాలీఫ్లవర్ జోలికి అసలు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉండే చక్కెరలు హార్మోన్లను ప్రభావితం చేస్తాయట. దీనివల్ల గ్యాస్ట్రిక్ వచ్చినట్లు అనిపిస్తుంది. దీంతో శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరని నిపుణులు అంటున్నారు. కాబట్టి శృంగారానికి ముందు ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు.

    బీన్స్ గింజలు
    ఆరోగ్యానికి మేలు చేసే బీన్స్ గింజలను శృంగారానికి ముందు తినకూడదు. ఎందుకంటే ఇవి తొందరగా జీర్ణం కావు. దీనివల్ల కొన్నిసార్లు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తే శృంగారంలో సరిగ్గా పాల్గొనలేరు. సాధారణంగా బీన్స్ గింజలు తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని డైలీ తినడం మంచిదే. కానీ శృంగారానికి ముందు అసలు తినకూడదని నిపుణులు అంటున్నారు.

    పాప్ కార్న్
    పాప్‌కార్న్‌ను శృంగారానికి ముందు తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట. మహిళలు తిన్నా పర్లేదు. కానీ పురుషులు మాత్రం పాప్‌కార్న్‌ను శృంగారానికి ముందు అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పాప్‌కార్న్ ఆరోగ్యానికి మంచిదే. ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శంగారానికి ముందు మాత్రమే వీటిని తీసుకోవద్దు. తర్వాత తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.

    జంక్ ఫుడ్
    టేస్టీగా ఉంటాయని జంక్‌ఫుడ్ వాటిని అసలు శృంగారానికి ముందు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి లైంగిక ఆస్తకిని తగ్గిస్తాయట. అలాగే బద్ధకం, నిద్ర వచ్చినట్లు అనిపిస్తుందట. దీనివల్ల పార్ట్‌నర్ కూడా ఇబ్బంది పడతారు. సాధారణంగా అయిన కూడా జంక్ ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయిన కూడా తినడానికి చాలా మంది ఇష్టపడతారు. దీన్ని డైలీ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనల కోసం నిపుణులను సంప్రదించడం మంచిది.