Jewelery In Bank Lockers: ప్రస్తుత కాలంలో డబ్బు ప్రధాన అవసరం. సామాన్యుల నుంచి ధనికుల వరకు ఏ చిన్న అవసరం తీరాలన్న డబ్బు ఉండాల్సిందే. దీంతో కొందరు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అయితే సంపాదించిన డబ్బును ఎక్కడ దాచాలో తెలియక అయోమయం పడేవారు ఇప్పటికి చాలామంది ఉన్నారు. కొందరు ఇంట్లోనే డబ్బు ఉంచుకుంటూ అవసరాలు తీర్చుకుంటారు. మరికొందరు బ్యాంకులో దాచుకుంటారు. అయితే డబ్బుతోపాటు ముఖ్యమైన పత్రాలు , కొన్ని ఆభరణాలు ఇంట్లో ఉండడం వలన దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని బ్యాంక్ లాకర్ లో ఉంచితే సేఫ్ గా ఉంటాయి అయితే బ్యాంకు లాకర్ ఓపెన్ చేయడానికి మినిమం లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలని కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి కానీ ఇంత మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ అవసరం లేదు. మరి ఎంత డిపాజిట్ చేస్తే బ్యాంకు లోపల లాకర్ ఓపెన్ చేయొచ్చు? ఆ వివరాలు ఏంటి?
ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు బ్యాంకులు అన్ని విధాలుగా సహకరిస్తాయి. ఇదే సమయంలో కొన్ని ఆభరణాలను, పత్రాలను భద్రపరిచేందుకు బ్యాంకులో లాకర్ సిస్టం ఉంటుంది. లాకర్ ఓపెన్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒకప్పుడు బ్యాంకు లాకర్ ఓపెన్ చేయడానికి కష్టంగా ఉండేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సులభతరం చేసింది. బ్యాంకు లాకర్ ఓపెన్ చేయడానికి లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలని కొందరు చెబుతున్నారు.
కానీ లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపార్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఆభరణాలు లేదా పత్రాలు బ్యాంకు లాకర్లు భద్రపరచాలని అనుకుంటున్నారో వాటి అద్దె విలువకు మూడు రేట్లు ఫిక్స్డ్ డిపాయిడ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక ఆభరణం ఆభరణం బ్యాంకు లాకర్లలో డిపాజిట్ చేయాలని అనుకుంటే దీని అదే విలువ 5000 ×3=15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏ ఆభరణం అయితే బ్యాంకులో లాకర్లలో ఉంచాలని అనుకుంటున్నారో దాని అద్దె విలువకు మూడు రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అంతేకానీ లక్ష రూపాయలు చేయాల్సిన అవసరం లేదు .
ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ గైడ్లైన్స్ లో క్లియర్ గా పేర్కొంది. అయితే కొందరు అవగాహన లేకపోవడంతో బ్యాంకులో ఎక్కువ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులో ఏదైనా పత్రాలు అభరణాలు దాచే ముందు వాటికి సంబంధించిన గైడ్లైన్స్ పూర్తిగా తెలుసుకోవాలి లేకుంటే కొన్ని బ్యాంకులు మోసం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆభరణాలు భద్రపరిచే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి
బ్యాంకు లాకర్లలో డిపాజిట్ చేసే ముందు వాటి రెంట్ గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే అదనంగా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు లాకర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల నుంచి ముందే కన్ఫామ్ చేసుకోవాలి. బ్యాంకు లాకర్లలో ఆభరణాలను మాత్రమే దాచుకునే ప్రయత్నం చేయాలి. విలువైన పత్రాలు ఉంచడం వలన అవి డ్యామేజ్ అయితే వాటికి బ్యాంకు బాధ్యత వహించదు.