Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విజయయాత్ర కొనసాగిస్తున్నాడు. ఓటమెరని విధంగా తన గెలుపు మంత్రాన్ని పాటిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన టీ 20 మొదటి మ్యాచ్ లో విజయం సాధించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ఆడిన అన్ని మ్యాచుల్లో విజయాలు నమోదు చేస్తూ ఎదురే లేదని చాటుకున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచులో విజయంతో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

హార్థిక్ పాండ్యా ప్రతిభతో ఇంగ్లండ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఇండియా విజయపరంపర కొనసాగించింది. 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో ఇండియా పలు రికార్డులు సొంతం చేసుకుంది. వరుసగా 13 మ్యాచుల్లో విజయం సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఏ కెప్టెన్ సాధించని ఘనత రోహిత్ సాధించడం గమనార్హం. బంగ్లాదేశ్, న్యూజీలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ సిరీస్ లలో రోహిత్ శర్మ వరుస విజయాలు అందుకున్నాడు.
Also Read: Revanth Reddy: రేవంత్ మరో రాజశేఖర్ రెడ్డి అవుతారా?
ఇంతవరకు ఇండియాలో ఏ కెప్టెన్ కూడా సాధించని రికార్డును రోహిత్ సాధించాడు. విరాట్ కోహ్లికి సైతం దక్కని గౌరవం రోహిత్ కు దక్కడం విశేషం. దీంతో పాటు రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. 28 మ్యాచుల్లోనే 1000 పరుగుల మైలురాయిని దాటాడు. కోహ్లికి ఈ రికార్డు సాధించడానికి 30 మ్యాచులు అవసరమయ్యాయి. కానీ రోహిత్ మాత్రం ఈ ఘనత తక్కువ మ్యాచుల్లోనే సాధించడం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మకు అన్ని అవకాశాలు కలిసొచ్చినట్లు అయింది.

పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఆడటం ఇదే తొలిసారి. అంతకు ముందు ఆడిన మ్యాచులన్ని స్వదేశంలోనే జరిగాయి. దీంతో మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. విజయాల బాట పట్టింది. దీంతో రోహిత్ కు అదృష్టం కలిసి రావడంతోనే ఇంత విలువ వచ్చిందని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఆడిన మ్యాచులన్నింటిలో విజయాలు దక్కించుకున్న కెప్టెన్ గా ఖ్యాతి గడించాడు. భవిష్యత్ లో కూడా మరిన్ని విజయాలు సాధించి టీమిండియా పరువు నిలబెట్టాలని అభిమానుల ఆశిస్తున్నారు.
Also Read:Sai Pallavi: సాయి పల్లవి తప్పు చేసిందట.. ఫీల్ అవుతున్న అభిమానులు