Rishabhh Pant: టీం ఇండియా మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, విరాట్ తర్వాత స్థానంలో టెస్టు కెప్టెన్ బాధ్యతలు ఎవరు చేపడితే బాగుంటుందనే విషయంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. కొందరేమో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే ఆ బాధ్యతలు కూడా అప్పిగించాలని అంటుంటే కొందరు మాజీ ఆటగాళ్లు మాత్రం రోహిత్ కంటే టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ లో జరిగిన మూడో టెస్టులో ఓటమి తర్వాత టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కోహ్లీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అతను ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు ముందు 3 ఫార్మాట్లకు నాయకత్వం వహించిన విరాట్ ఇప్పుడు జట్టులో ఓ సాధారణ బ్యాటర్‌గా మాత్రమే కొనసాగనున్నాడు. కోహ్లీ హఠాత్తుగా కెప్టెన్సీ నంచి వైదొలగడంపై బీసీసీలో జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read: ‘బాహుబలి’ ప్రభాస్ మరో రికార్డు.. ఆసియాలో నెంబర్ వన్..!
బోర్డు సభ్యుల కారణంగానే కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. టెస్టు ఓడిపోయాక కూడా కొందరు సీనియర్లు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మెచ్చుకోవడం, మన వాళ్లను విమర్శించడం కూడా కోహ్లీకి నచ్చలేదని టాక్.. అయితే, ఇప్పుడు కోహ్లీ స్థానంలో టీ20, పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. వయసు, ఫిట్‌నెస్, గాయాల కారణంగా సతమతమవుతున్న రోహిత్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీ వారసుడిగా రిషబ్ పంత్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌కే తన ఓటు వేశాడు. రిషబ్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించే విషయమై ట్విట్టర్‌లో గవాస్కర్ చేసిన కామెంట్‌కు యువీ స్పందించాడు. ‘అబ్‌సాల్యుట్లీ! హి రీడ్స్ ద గేమ్ వెల్ బిహైండ్ ద స్టంప్స్’ అంటూ వికెట్ల వెనక ఉంటూ అతను ఆటను బాగా అధ్యయనం చేస్తాడని, టీమిండియాను మెరుగ్గా ముందుకు నడిపిస్తడని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరు టెస్టులో అందరూ చేతులెత్తేయగా పంత్ సెంచరీతో కదం తొక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలోనూ మెరుపు ఇన్సింగ్స్‌లు ఆడి టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయం అందించిన విషయం అందరికీ గుర్తుంటుంది.
Also Read: విరాట్ కెప్టెన్సీ శకం ముగిసింది.. నెక్ట్స్ ఏంటి..?