Tesla controversy: తెలంగాణలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నా ప్రస్తుతం రాష్ర్టంపైనే ఫోకస్ పెట్టారు. గతంలో క్యూ టీవీ అధినేత, తీన్మార్ మల్లన్న, అలియాస్ నవీన్ కుమార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం జైల్లో వేయించిన నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ నే టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ రగడ రేగుతోంది. మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న మరో మారు వివాదాలకు తెరలేపారు. దీనికి కార్ల కంపెనీని ఎంచుకున్నారు. దీంతో రాష్ర్టంలో రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.

టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంపై చేసిన విమర్శలు ప్రస్తుతం రాష్ర్టంపై కూడా పడ్డాయి. దీంతో దీనికి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్న అనే తెలుస్తోంది. దీంతో నెటిజన్లు సైతం తీన్మార్ మల్లన్న వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఇద్దరు వ్యక్తిగతంగా తేల్చుకోవాలే తప్ప ఇలా రాష్ర్ట ప్రయోజనాలు తాకట్టు పెడుతూ వీధికెక్కడం బాగా లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో అందరిలో కోపం వస్తోంది.
Also Read: ప్రపంచం మీదకు ప్రాణాలు తీసే మరో మహమ్మారి ‘డెల్టాక్రాన్’
తీన్మార్ మల్లన్న నిర్వహించిన ఓ పోల్ లో మంత్రి కేటీఆర్ చెబుతున్న మాటలు అవాస్తవాలని చెబుతూ ట్వీల్ చేయడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇందులో రెండు ఆప్షన్లు ఇచ్చారు. నిజమే అని ఒకటి, పచ్చి అబద్ధమని మరో ఆప్షన్లు ఇచ్చారు. దీంతో నిజమే అని 19 శాతం, అబద్ధం అని 81 మంది ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లలో సహజంగానే అసహనం పెరుగుతోంది.
తీన్మార్ మల్లన్న పరోక్షంగా ఎలాన్ మస్క్ కు తెలియజేయడంతో రాష్ర్టం పరువు ఏమవుతుందనే వాదన వినిపిస్తోంది. రాజకీయాలు వేరు రాష్ర్ట ప్రయోజనాలు వేరు. మనకు లాభం కలుగుతుందని అనుకుంటే మన మైనస్ లను కూడా పక్కన పెట్టాల్సి ఉన్నా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే మల్లన్న, కేటీఆర్ ఇలా చేయడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తీన్మార్ మల్లన్న చేసిన ట్వీట్లతో అందరిలో ఆగ్రహం పెరుగుతోంది. రాష్ర్ట అభివృద్ధి దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించడానికి వీలు కల్పించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న కోపంతో కించపరచడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణను పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా ఇలా చేయడం బాధాకరమనే విధంగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మన లోపాలను బయటపెట్టుకుని మనకు రావాల్సిన నిధులు రాకుండా చేయడానికి ఇలా చేయడంపై విమర్శలే పెరుగుతున్నాయి.
Also Read:‘బాహుబలి’ ప్రభాస్ మరో రికార్డు.. ఆసియాలో నెంబర్ వన్..!