Chameleon Facts: నేచర్‌లో మనం రకరకాల యానిమల్స్ చూస్తుంటాం. అలా వింత, విశేషాలు చూసి ఆనందపడిపోతుంటాం కూడా. అలా ప్రకృతిలో ఉన్న ఆసక్తికర జంతువులను చూసి మానసిక ఉల్లాసం కూడా పొందుతుంటాం. అలా స్పెషల్ ఫీచర్స్ కలిగిన సరీసృపం ‘ఊసరవెల్లి’ అని చెప్పొచ్చు. ఇకపోతే ఊసరవెల్లి అనగానే అందరికీ గుర్తొచ్చే విషయం రంగులు మార్చడం. అలా ఊసరవెల్లి రంగులు మార్చడం వెనుక ఉన్న రీజన్ అందరు దాదాపుగా తమకు తెలుసని అనుకుంటారు. కానీ, వారు అనుకున్న రీజన్ సరైనది కాదండోయ్. ఒకవేళ వారు అనుకునే రీజన్ కేవలం శత్రువుల నుంచి తప్పించుకోవడానికే రంగులు మారుస్తుందని అనుకుంటే వారు పొరపడినట్లే.. నిజానికి ఆ కారణం సరైనది కాదండోయ్.. అసలైన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతిలో ఉండే జీవరాశులను చూస్తే మనకు ఆనందం కలుగుతుంటుంది. అవి మనలను ఆశ్చర్యపరుస్తుంటాయి కూడా. అలా ఆశ్చర్యపరిచే వాటిలో ఊసరవెల్లి కూడా ఉంటుంది. శాస్త్రీయ పరిశీలన చేస్తే కాని కొన్ని జంతువులు వింతగా లేదా విశేషాలను కలిగి ఉండటం వెనుకన్న కారణం అర్థం కాదని పెద్దలు చెప్తుంటారు. అలా పరిశీలనలో తేలిన నిజాలు కొందరు అందరికీ వివరిస్తుంటారు. ఇకపోతే ఊసరవెల్లి రంగులు మార్చడానికి గల కారణం తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులోకి ఉంచుకోవడం కోసమేనన్న సంగతి తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
Also Read: తాంబూలంగా తమలపాకులు మాత్రమే ఇవ్వడానికి గల కారణం ఏమిటో తెలుసా?
శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచుకోవడంతో పాటు అవి ఒకదానితో మరొకటి సంభాషించడానికి కావల్సిన శక్తిని రంగుల రూపంలో వెలువరుస్తుంటాయి. ముదురు రంగును కలిగి ఉండటం వెనుక ఉద్దేశం ఊసరవెల్లులు పోరాటం చేయగలవని చెప్పడమే. అవి వాటి కళ్లతో వివిధ దశల్లో వస్తువులను చూడగలుగుతాయి. అయితే, బల్లుల వలె కాకుండా ఊసరవెల్లి తోక ఒకసారి తెగిపోతే ఇక తిరిగి పెరిగే అవకాశాలు అయితే ఉండబోవు.
అయితే, చాలా మంది ఏదేని విషయంలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటావని విమర్శలు చేస్తుండటం మనం చూడొచ్చు. అయితే, అక్కడ మనుషులు తమ అవసరం మేరకు మాటలు మారుస్తుండగా, ఊసరవెల్లులు మాత్రం తమ శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోవడం కోసం కలర్స్ చేంజ్ చేస్తుంటాయి. మొత్తంగా ఊసరవెల్లులు ఇతర సరీసృపాలతో పోలిస్తే కొంత డిఫరెంట్ ఫీచర్స్ అయితే కలిగి ఉన్నాయన్న సంగతిని గుర్తించాలి.
Also Read: అదృష్టం కలిసిరావాలా.. వాస్తు ప్రకారం కచ్చితంగా చేయాల్సిన ఐదు పనులివే!