AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించి పనులు కూడా చేస్తోంది. గతంలో ఉన్న 13 జిల్లాలకు తోడుగా మరో 13 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేసి మొత్తం 20 జిల్లాలు చేసింది. స్థానికంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుతో సర్కారు కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
తమ ప్రాంతాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజల నుంచి డిమాండ్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ..హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక అలాగే ఇంకా డిమాండ్స్ పెరిగితే తెలంగాణ తరహా ఇబ్బందులొస్తాయని అంటున్నారు. తెలంగాణాలోనూ ఈ తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తెలంగాణలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ .. ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని నారాయణపేట, ములుగుప్రాంతాలనూ కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అలా తెలంగాణ కాస్త 33 జిల్లాలు అయిపోయింది. ఇక పలు ప్రాంతాల ప్రజలు కూడా తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Andhra Pradesh: ఏపీ రావణకాష్టంలా మారుతోందా?
ఈ రకమైన డిమాండ్లు ఏపీ సర్కారు ముందర కూడా ఉండనున్నాయి. స్థానిక ప్రజల పరిస్థితులు, డిమాండ్స్, ఏరియాస్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఏపీ సర్కారు ఒక నిర్ణయానికి వచ్చిందని వైసీపీ నేతలు చెప్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గినా అన్ని చోట్ల నుంచి ఒత్తిళ్లు వచ్చే చాన్సెస్ ఉంటాయని, అలా సర్కారు ఇరకాటంలో పడొచ్చని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ వర్గాలతో పాటు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీనియన్ ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపాడు. సీనియర్ ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి కూడా ఏపీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పింది. అయితే, నందమూరి బాలకృష్ణ మాత్రం భిన్నంగా హిందూపురాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అయితే, బాలయ్య కూడా జిల్లాల ఏర్పాటును స్వాగతించాడు.
Also Read: Andhra Pradesh: ఏపీలో సమస్యలు వారికి గుర్తుకు రావడం లేదా?