ICYMI – WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023
IND vs AUS Ravindra Jadeja : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరుగుతున్న రెండవ టెస్టులో 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండవ ఆల్ రౌండర్ గా చరిత్రకు ఎక్కాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ తో పాటు ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హడ్లీ, షాన్ పొలాక్ రికార్డులు అధిగమించాడు.
టెస్ట్ ఫార్మేట్లో 2,500 పరుగులతో పాటు, 250 వికెట్లు సాధించిన జాబితాలో ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఇయాన్ బోతాం 55 మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా 62, కపిల్ దేవ్ 65, హడ్లీ 70, పొలాక్ 71, రవిచంద్రన్ అశ్విన్ 75 తర్వాతి స్థానంలో ఉన్నారు. టెస్టుల్లో ఇప్పటివరకు 37 యావరేజ్ తో 2,593 పరుగులు చేసిన జడేజా…ఉస్మాన్ ఖవాజా వికెట్ తో 250 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి టెస్ట్ లోనే ఈ మైలురాయి కోసం జడేజా తనను ఇబ్బంది పెట్టాడని మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరులతో రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఐదు వికెట్ల ఘనత కోసం అశ్విన్, 250 వికెట్ కోసం జడేజా టెయిల్ ఎండర్లను అవుట్ చేస్తానని షమీ నన్ను చాలా ఇబ్బంది పెట్టారని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు.. తొలి టెస్టులో ఈ ఘనతను చేజార్చుకున్న జడేజా.. రెండో టెస్టులో తొలి సెషన్ లో ఉస్మాన్ ఖవాజా ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అతడు రివ్యూ తీసుకోగా బంతి అవుట్ సైడ్ పిచ్ అయినట్టు తేలడంతో థర్డ్ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. అయితే లంచ్ బ్రేక్ అనంతరం ఎట్టకేలకు ఖవాజా ఇన్నింగ్స్ కు జడేజా తెరదించాడు.. కే ఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్ సహాయంతో ఖవాజాను అవుట్ చేసి 250 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు..ఇక మొదటి ఇన్నింగ్స్ లో జడేజా మొత్తం మూడు వికెట్లు తీశాడు.
