
KCR -ABN RK : బావ మేలు బామ్మర్ది కోరతాడని ఒక సామెత.. కానీ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కు, ఆయన బావ అని పిలిచే కెసిఆర్ కు ఎక్కడ చెడిందో తెలియదు గానీ… పుట్టినరోజు నాడు కూడా “వారంలో ఐదు రోజులు తాగి పడుకునేవాడిని” అంటూ తన ఏబీఎన్ యూట్యూబ్ ఛానల్ లో ఓ థంబ్ నెయిల్ తో గతంలో తన ఇంటర్వ్యూ చేసిన ఓ వీడియోను వదిలాడు. దీంతో రాధాకృష్ణ మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పుట్టినరోజు నాడు ఈ పురావస్తు తవ్వకాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు..
వాస్తవానికి ఒక పెద్దమనిషి పుట్టినరోజు అయితే.. శుభాకాంక్షలు చెపుతాం. చల్లగా ఉండు అని దీవిస్తాం. ఆయనకు మనకు పడకపోతే మౌనంగా ఉంటాం. అంతే తప్ప నువ్వు తాగుబోతువు, అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాతో చెప్పావు అని గుర్తు చేసి, విషాన్ని వెదజల్లి, కుసంస్కారాన్ని ప్రదర్శించం.
వేమూరి రాధాకృష్ణ ఇదే చేశాడు.. తన బావ పుట్టినరోజు నాడు గతంలో తనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెసిఆర్ తనకు మద్యం ఎలా అలవాటైందో వివరించాడు. తాగితే తప్పేముంది? దొరలాగే చెబుతున్నాను. బాజాప్తా చెబుతున్నాను అంటూ అని కొన్ని వివరాలు షేర్ చేసుకున్నాడు. కేసీఆర్ ను రాజకీయ ప్రత్యర్థులు తాగి పడుకుంటాడు, తాగుబోతు అని విమర్శించే వాళ్ళు.. అలా విమర్శలు చేసేవాళ్లు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే తనకు మద్యం ఎలా అలవాటు అయిందో కేసీఆర్ చెప్పిన దాన్ని కొంతమంది నమ్మొచ్చు.. నమ్మకపోనూ వచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ పిచ్చి థంబ్ నెయిల్ ఒకటి పెట్టేసి, తాజా ఫోటోలు పెట్టి యూట్యూబ్లో ప్రసారం చేయడం దేనికి? వారంలో నేను ఐదు రోజులు తాగి పడుకుంటా అనే మాట కేసీఆర్ నోటి వెంట రాలేదు. అసలు ఆ వీడియోను ముక్కలు ముక్కలు చేసి యూట్యూబ్లో యాడ్స్ కోసం అమ్ముకునే ప్రయత్నం లాగానే కనిపించింది..” విజయశాంతి ఎవరో నాకు తెలియదు, కేటీఆర్ ప్రతిమను గుర్తించింది చంద్రబాబే, మా ఆవిడ కూడా నా మీద అరుస్తుంది” అనే థంబ్ నెయిల్స్ కూడా కనిపించాయి.
సరే వీటన్నింటినీ పక్కనపెట్టినా మద్యం వీడియో బిట్ మాత్రం చాలా అభ్యంతరకరం. వీడియో పున ప్రచారం టైమింగ్ కూడా చాలా తప్పే. సి ఆర్ అని మాటలను కూడా ఆయన నోట్లో పెట్టడం ఏమాత్రం బాగోలేదు. కేసీఆర్ మీద విమర్శలు చేసినా ఓకే. కానీ పుట్టినరోజు నాడు ఈ పురావస్తు తవ్వకాలు దేనికి? మీ బాస్ ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇలా యూట్యూబ్ రూపంలో ఇవ్వమన్నాడా ఏంటి?
https://youtu.be/c9SvX7IKooo