
ఈమధ్య కాలం లో రీ రిలీజ్ అనేది ఒక లేటెస్ట్ ట్రెండ్ గా మారిపోయింది.టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరు తమ కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిన సినిమాలను లేటెస్ట్ టెక్నాలజీ కి మార్చి విడుదల చేస్తున్నారు.మన టాలీవుడ్ లో ఇదివరకు చాలా సినిమాలు ఇలా రీ రిలీజ్ అయ్యాయి.వాటిల్లో పోకిరి , జల్సా , ఖుషి మరియు బిల్లా వంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ, మిగిలిన రీ రిలీజ్ లు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.
కనీసం ప్రింట్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయ్యాయి.కానీ రీసెంట్ గా విడుదలైన హీరో సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.స్టార్ హీరోల రీ రిలీజ్ లు కూడా ఫ్లాప్ అవుతున్న ఈరోజుల్లో సిద్దార్థ్ మూవీ రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఫిబ్రవరి 14 వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే మంచి ఓపెనింగ్ ని దక్కించుకుంది.చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి తెల్లవారుజాము నుండే థియేటర్స్ లో షోస్ కి హౌస్ ఫుల్స్ పడ్డాయి.మొదటి రోజు ప్రేమికుల దినం కాబట్టి హౌస్ ఫుల్ అయ్యిందని అనుకోవచ్చు, కానీ ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 75 లక్షల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం.ఈరోజు ధనుష్ హీరో గా నటించిన ‘సార్’ మూవీ తెలుగు లో గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకి డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలు వచ్చాయి.ఇదే ఫ్లో లో ముందుకు పోతే ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కోటి రూపాయిల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.