
IND vs AUS : రవీంద్ర జడేజా భారత్‌లో జరిగిన రెండు సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఆడలేదు. గాయం కారణంగా తాను ఆడలేనని బీసీసీఐకి లేఖ రాయడంలో జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే అతను గుజరాత్ ఎన్నికల కారణంగానే టీ ఇండియాకు ఆడలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ గవాస్కర్ – బోర్డర్ కప్ తొలి మ్యాచ్‌లోనే సమాధానం ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల పడగొట్టడం ద్వారా తన రీఎంట్రీని గొప్పగా చాటుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సహచరుడు రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆస్ట్రేలియాను కుప్పకూల్చాడు.
-ఆస్ట్రేలియాను తిప్పేశాడు..
టెస్ట్ క్రికెట్ ఫైనల్ బెర్తు కోసం జరుగుతున్న గవాస్కర్–బోర్డర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి టెస్టు గురువారం మొదలైంది. నగపూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇద్దరి స్పిన్నర్లు కేవలం 63.5 ఓవర్లతో ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్(31) మినహా మిగిలిన ప్లేయర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
-తొలిదెబ్బ కొట్టిన ఫాస్ట్ బౌలర్లు..
నాగ్‌పూర్‌లో ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌న ఆస్ట్రేలియా కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, షమీ ఆసీస్ జట్టును తొలి దెబ్బ తీశారు. ఖవాజా(1)ని సిరాజ్ అవుట్ చేస్తే.. వార్నర్(1)ని షమీ అవుట్ చేశాడు. తర్వాత మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడటంతో లంచ్ విరామానికి ఆసీస్ 76/2గా నిలిచింది.
– కుదిరిన స్పిన్నర్ల లయ…
భోజన విరామం అనంతరం రెండో సెషన్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. స్పిన్‌ను బాగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో కనిపించిన లబుషేన్ (49)ను జడేజా బోల్తా కొట్టించాడు. జడేజా బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసి స్టంపౌట్ అయ్యాడు. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం మొదలైంది. ఆ తర్వాతి బంతికే రేన్ షా(0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరికాసేపటికే స్టీవ్ స్మిత్ (37)జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్యారీ(36), హ్యాండ్స్ కాబ్ జట్టును ముందుకు నడిపారు. క్యారీ రివర్స్ స్వీప్ షాట్లతో వేగంగా పరుగులు సాధించాడు. బౌండరీలు కొట్టాడు. అయితే అశ్విన్ తెలివిగా బోల్తా కొట్టించాడు. రివర్స్ స్వీప్‌కు వెళ్లి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కెప్టెన్ కమిన్స్(6), అరంగేట్రం హీరో మర్పీ(0) వెంట వెంటనే అవుటయ్యారు. టీ విరామం సమయానికి 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును మూడో సెషన్స్‌లో మిగతా రెండు వికెట్లె పడగొట్టి 177 పరుగులకు కట్టడి చేశారు. రవీంద్ర, రవిచంద్రన్ స్పిన్ ద్వయం లయతో బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్ బాట పట్టారు.