BCCI- Impact Player Rule: ఆట, ఆర్జన.. ఈ రెండింటి కలబోతే టి20. 15 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఈ నయా క్రికెట్.. ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అప్పట్లో ఐసీసీ కూడా ఊహించి ఉండదు. ఏకంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ను దాటేసింది. తక్కువ సమయంలో మ్యాచ్ ముగుస్తుండడంతో అభిమానులు కూడా ఆటను తుదికంటా ఆస్వాదిస్తున్నారు. అందుకే వన్డేలు, టెస్ట్ ల కన్నా టి20 మ్యాచ్ లకే ఆదరణ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బిసిసిఐ మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది.

పొట్టి క్రికెట్ ఫార్మాట్ ని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనను తెరపైకి తీసుకురానుంది. దీంతో ప్రతి జట్టు మ్యాచ్ మధ్యలోనే టాక్టికల్ సబ్ స్టిట్యూట్ ను ఆడించవచ్చు. కొంతకాలంగా బోర్డు ఈ నిబంధనను ఐపీఎల్ లో అమలు చేయాలని అనుకున్నా.. ఆచరణలో పెట్టక పోయింది. ఈ క్రమంలో అక్టోబర్ 11 నుంచి జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ అనే నిబంధనను అమలు చేయాలనుకుంటుంది. వచ్చే ఐపిఎల్ లోనూ ఈ రూల్ కనిపిస్తుంది.. ఇప్పటికే ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ మెయిళ్ళు చేసింది. ” టి20 లకు ఆదరణ పెరుగుతోంది. మునుముందు ఇది సాకర్ ను మించిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. మ్యాచ్ లకు ఉండే ఆకర్షణను దృష్టిలో పెట్టుకొని, అభిమానులకు క్రీడానందాన్ని కలుగజేస్తూ ఇంపాక్ట్ ప్లేయర్ అనే పద్ధతిని పరిచయం చేయబోతున్నామని” బిసిసిఐ పేర్కొంది. బిగ్ బా ష్ లీగ్ లో ఈ నిబంధన ఉంది.. రగ్బీ, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ లోనూ ఈ రూల్ అమలవుతోంది. ఈ విధానం వల్ల ఆయా జట్లు భారీగానే లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ పద్ధతి ముఖ్యంగా టాస్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు ఒక జట్టు టాస్క్ ఓడి మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు బౌలింగ్ చేయాల్సివస్తే.. ఆ సవాల్ ను గా ఎదుర్కొనేందుకు తమ బౌలింగ్ దళంలో మార్పు చేసుకోవచ్చు. అలాగే సెకండ్ బ్యాటింగ్ జట్టుకు టర్నింగ్ పిచ్ ఎదురైతే అదనపు బ్యాటర్ ను కూడా జట్టులోకి తీసుకునే వెసలు బాటు ఉంటుంది.
ఇంతకీ డబుల్ ఇంపాక్ట్ అంటే ఏమిటి
క్రికెట్లో మ్యాచ్ మధ్యలో ఆటగాడు గాయపడితే అతని స్థానంలో సబ్సిట్యూట్ రావడం సాధారణమే. కానీ ఇలాంటి ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉండదు. కేవలం ఫీల్డింగుకు మాత్రం పరిమితమవుతాడు.. కానీ అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం జట్టులో ఎవరైనా గాయపడినప్పుడే కాకుండా మ్యాచ్లో అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఒక ఆటగాడి స్థానంలో మరొకరిని వ్యూహాత్మక సబ్స్టిట్యూట్ గా తీసుకుంటారు.. ఇలా వచ్చే ఆటగాడు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా అవకాశాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది. వ్యూహాత్మక సబ్స్టిట్యూట్ ను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటామంటే కుదరదు. 14వ ఓవర్ ముగిసే లోపే ఈ వ్యూహాత్మక సబ్స్టిట్యూట్ ఆటగాడి ఎంపిక జరిగిపోవాలి. అది కూడా ఒక ఓవర్ పూర్తయ్యాకే. కొన్ని సందర్భాల్లో దీనికి మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఓవర్ మధ్యలో వికెట్ పడినప్పుడు బ్యాటింగ్ జట్టు తమ సబ్ ఆటగాడిని ఫ్రీజ్ లోకి దించవచ్చు. అలాగే ఓవర్ మధ్యలో ఎవరైనా ఫీల్డర్ గాయపడితే కూడా ఫీలింగ్ జట్టు తమ సబ్స్టిట్యూట్ టు ను పంపవచ్చు. ఒకవేళ మ్యాచ్ 10 ఓవర్లకు మాత్రమే కుదిస్తే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వర్తించదు.

కానీ 17 ఓవర్లకు మాత్రమే కుదిస్తే 13 ఓవర్ కు ముందుగా లేదా 11 ఓవర్లకు కుదిస్తే తొమ్మిదో ఓవర్ కు ముందే ఈ మార్పు జరగాలి. అలాగే వ్యూహాత్మక సబ్స్టిట్యూట్ ఎంపిక విషయాన్ని ముందుగానే ఫీల్డ్ ఎంపైర్ కు తెలియజేయాలి. మరోవైపు టాస్ వేయడానికంటే ముందే తుది జట్టుతో పాటు నలుగురు ఇంఫాక్ట్ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో ఒకరిని మ్యాచ్ మధ్యలో ఎంపిక చేసుకునే వెసలు బాటు ఉంటుంది. అయితే ఇప్పటికే క్రికెట్లో పలు మార్పులు జరిగాయి.. డీఆర్ఎస్, బౌల్ అవుట్.. ఫ్రీ హిట్ వంటి కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తూ క్రికెట్ ను ఒక పండగలా మారింది. దీనికి మరిన్ని రంగులు అద్దేందుకు బీసీ సీఐ ప్రయత్నాలు చేస్తున్నది. ఇక ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఇంపాక్ట్ విధానం వల్ల ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.
[…] […]